గద్వాల టౌన్, ఆగస్ట్టు 4 : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.. అందుకే ఈ మాసాన్ని శుభాల మా సం.. పండుగల మాసం అంటారు.. శ్రావణం అంటే నే ఆధ్మాత్మిక మాసం.. ఈ నెలలో అన్ని రోజులు శు భకరమే.. నాగుల పంచమి మొదలు వరలక్ష్మీ వ్ర తం, రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, కృష్ణాష్టమి, రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు లాంటి ఎం తో విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే రావడం తో ఎంతో విశిష్టత చేకూరింది.. ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రత్యేకమైంది ఈ మాసం.. ఈ మా సాంతం ప్రతి ఇల్లు నిత్యపూజలతో అలరారుతుంది.. ఆలయాలన్నీ భక్తులో కిక్కిరి సి పోతాయి.. ప్రతి ఆలయం పూజ లు, అభిషేకాలతో అలరారుతాయి.
శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వ చ్చేదే శ్రావణ మాసం. ము క్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఇది. అలాగే శ్రీనివాసు ని జన్మనక్ష త్రం కూడా శ్రావణమే.. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణమాసంలోనే.. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం.. భక్తిమార్గాల్లో శ్రవణభక్తి మొదటిది.. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీమహావిష్ణువుని పూజిస్తాడని ప్రతీతి.
అందుకే శ్రావణ మాసానికి ఇంతటి ప్రత్యేకత సంతరించుకుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ మాసాంతం శ్రవణ నక్షత్రం ఉండటమే కారణమని పండితులు చెప్తున్నారు. మాసాంతం స్వామిని, అమ్మవారిని కొలిస్తే సకల పాపాలు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం వర్షరుతువుతోపాటు పండుగలను తీసుకొస్తుంది. ఈ మాసంలో వచ్చినన్ని పండుగలు ఏ మా సంలో రావు. అందుకే ఈ మాసాన్ని పండుగల మా సం అని కూడా అంటారు.
శ్రావణ శుద్ధ, చవితి, పంచమి రోజున నాగులచవితి, పంచమిని జరుపుకొంటారు. ఈ రెండు రోజులతోపాటు, శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో పెద్దలు, పిల్లలు పుట్టల్లో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తారు. నాగముద్రికలను సమర్పించుకుంటారు. ఇలా చేస్తే సర్వదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూ ర్ణిమ అంటారు. అలాగే రక్షా బం ధన్, జం ద్యాల పౌర్ణమిగా జరుపుకొంటారు. అలాగే ఇదే రోజున సంతోషిమాత జయంతి కావడం ఎంతో విశిష్టత చేకూరింది. మాతను ఆరాధించడం ద్వారా సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయన్నది హిందువుల నమ్మకం.
శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజును శ్రీకృష్టుడి జన్మాష్టమిగా జరుపుకొంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ప్రతి పల్లె, ప్రతి పట్టణం ఉట్టి సంబురాలు జరుపుకొంటారు. చిన్నారులను గోపికలుగా, కృష్ణులుగా అలంకరించి మురిసిపోతారు.
శ్రావణమాసంలో ఆలయాలన్నీ నూతన శోభను సంతరించుకోనున్నాయి. జిల్లా కేంద్రం గద్వాలలోని ఆలయాలతోపాటు వివిధ మండలాల్లోని ప్రధాన ఆలయాలన్నింటినీ శోభాయమానంగా అలంకరించనున్నారు. నిత్యాభిషేకాలతో, నిత్యపూజలతో ఆలయాలు అలరాలనున్నాయి. కోటలోని భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం, మార్కండేయస్వామి, కన్యకాపరమేశ్వరి, అంబాభవాని, భద్రకాళి, అన్నపూర్ణేశ్వరి, పాండురంగస్వామి, వేంకటేశ్వరస్వామి, నదీఅగ్రహారం స్పటికలింగ్వేరస్వామి, లక్ష్మీనృసింహస్వామి, ఉత్తరముఖ ఆంజనేయస్వామి ఆలయాలతోపాటు, అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహిస్తారు.
శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాల్లోనూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులు, అవివాహిత స్త్రీలు ఆచరించే మంగళగౌరీ వ్రతం అత్యంత విశేషమైంది. అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తోరశత నామాలతో పూజిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే సుఖ సంపదలు, ధనదాన్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందన్నది ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.
నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో శ్రీవరలక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. అష్టఐశ్వార్యాలు ప్రసాదించాలని, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు.
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. ఈ రోజున అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి శుక్రవారం ఎంతో శుభప్రదమైంది. ఈ రోజున అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, అల్లిన మల్లెల మాలను సమర్పిస్తే సకల పాపాలు తొలుగుతాయన్నది, అలాగే రుణవిముక్తి, లక్ష్మీకటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.