జడ్చర్లటౌన్, జూన్ 16 : మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి జ్ఞాపకార్థం మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖాన సౌజన్యంతో సోమవారం జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించి వైద్య పరీక్షలకు వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. అనంతరం ఎస్వీఎస్ దవాఖా న వైద్యులు 450 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
అదే విధంగా 16 మంది కంటి శుక్లాలకు సంబంధించి ఎస్వీఎస్ దవాఖానలో ఉచిత సర్జరీకి రెఫర్ చేశారు. అలాగే గంగాపూర్ పీహెచ్సీ వైద్యుడు ప్రతాప్ చౌహా న్ వందమందికిపైగా క్షయ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, బీఆర్ఎస్ నా యకులు రఘుపతిరెడ్డి, శ్రీకాంత్, ఇంతియాజ్, రాజేందర్రెడ్డి, నాగిరెడ్డి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.