మల్దకల్ : మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కురువ రామకృష్ణ (30) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందాడు. రామకృష్ణ గత, నాలుగైదు సంవత్సరాల క్రితం నుండి గద్వాల్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్ జెండర్తో అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెసింది.
కాగా, శుక్రవారం ఉదయం ట్రాన్స్ జెండర్తో పాటు మరో నలుగురు కలిస రామకృష్ణ ఇంటికి వెళ్లారు. కాగా, అతను ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిసింది. వెంటనే ట్రాన్స్ జెండర్లు రామకృష్ణ మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.