దేవరకద్ర, అక్టోబర్ 24 : ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మం డలంలోని అడవి అజిలాపూర్ గ్రా మంలో చోటుచేసుకున్నది. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్ఫూర్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం అజిలాపూర్ గ్రా మానికి చెందిన గొల్ల మైబు (40) ప్రతి రో జు ఉదయం గ్రామం నుంచి వచ్చిన మం డల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మా ర్కెట్ యార్డులో హమాలీగా పనిచేస్తు జీవనోపాది పొందుతున్నాడు.
రోజు మాదిరిగా గురువారం మార్కెట్ యార్డులో రాత్రి వడ్ల లారీలో వడ్ల బ స్తాలు నింపి స్వగ్రామానికి మోటర్ సైకిల్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలితో అతి దారుణంగా హత్య చేశారు. దీం తో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ, సీ ఐ వెల్లడించారు. మృ తుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.