నాగర్కర్నూల్, జూన్ 25 : నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా డాక్టర్ మల్లు రవి మంగళవారం లోక్సభలో ప్రమాణం చేశారు. కందనూలు ఎంపీగా ముచ్చటగా మూడోసారి గెలుపొందారు. ఈ మేరకు లోక్సభలో భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. చివరన జై హింద్.. జై తెలంగాణ.. జై కాన్సిస్ట్యూషన్..జై భీమ్.. అని అన్నారు.
మహబూబ్నగర్ ఎంపీగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మంగళవారం పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ సమక్షంలో డీకే అరుణ ప్రమాణం చేశారు. అనంతరం పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.