సంక్రాంతి పర్వదిన వేడుకలను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహం గా జరుపుకొన్నారు. మంగళ, బుధవారాల్లో మకర, కనుమను వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా మహిళలు ఇంటింటా వేసిన రంగవల్లులు ఎంతో ఆకట్టుకున్నాయి. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పిండి వంటకాలతో విందు భోజనాలను ఆరగించా రు. సాయంత్రం రైతులు ఆలయాల చుట్టూ ఎద్దులబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనలు చేశారు. మరక సం క్రాంతి సందర్భంగా పలు సంఘాలు, స్వచ్ఛంద సం స్థల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ముగ్గు ల పోటీ లు, కబడ్డీ, క్రికెట్, ట్రాక్టర్ రివర్స్‌గేర్, సందేపురాళ్లు తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మూడురోజులపాటు జరిగిన సంబురాలతో గ్రామాలు సందడిగా మారాయి.
-నెట్వర్క్ నమస్తే తెలంగాణ, జనవరి 15
రంగవల్లులతో గద్వాల చీర
గద్వాల, జనవరి 15 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్రకాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర చేనేత మహిళా కళాకారులు రంగవల్లులతో గద్వాల చేనేత చీర ముగ్గు వేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నది. గద్వాల చీరను గుర్తుపట్టే విధంగా కంచుకోట కొమ్మ, చిన్నకోటకొ మ్మ, హంస బార్డర్ కలిగిన చీరను ముగ్గు రూపం లో వేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు కళాత్మాకమైనా డిజైన్‌తో ముగ్గును తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గద్వాల చీరలను అందరికీ గుర్తుండేలా ఇంటిముందు వేసుకొన్నా రు. ముగ్గువేసిన వారిలో పద్మావతి, లక్ష్మి, జ్యోతి, మాధవితోపాటు పలువురు మహిళలు ఉన్నారు.