అచ్చంపేట/ దో మలపెంట, ఫిబ్ర వరి 22 : నల్లమల ప్రాంతంలోని అ మ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమా దం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 42మంది కా ర్మికులు, ఇంజినీర్లు ప్రాణా లతో బయటపడగా.. మిగిలిన ఎనిమిది మంది ప్రమాదంలో చిక్కుకోగా వారికోసం ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసా గుతున్నాయి. ఈ ఘటన దేశ వ్యా ప్తంగా విస్తరించింది. ప్రధానమంత్రి మోదీ సీఎం రేవంత్‌రెడ్డికి కాల్చేసి వివరాలు అడిగారు. ప్రమాదంలో చి క్కుకున్నవారిని రక్షించేందుకు కావా ల్సిన సహాయక చర్యలు కేంద్రం అంది స్తుందని పేర్కొన్నారు. జరిగిన ఘటనపై సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణం సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలు అందించి, టన్నెల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని సూచనలు చేశారు.
ప్రమాదం జరిగిందిలా..
నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద సుదీర్ఘ వి రామం తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పున: ప్రారంభించారు. నాలుగు రోజుల కిందట పనులు ప్రారంభించారు. రో జువారీగా పనులు మొదలుపెట్టినట్లే శనివారం ఉద యం 8 గంటలకు ఫస్ట్షిప్ట్లో సుమారు 50మంది కార్మికులు, ఇంజినీర్లు సొరంగంలో పనులు చేసేందుకు లోపలికి వెళ్లారు. వెళ్లిన ఆరగంటకే ప్రమాదం సంభ వించింది. ఏదైతే టన్నెల్ బోర్ మిషన్(టీబీఎం) వద్ద పని మొదలుపెట్టారో అక్కడికి నీరు, మట్టి చేరుతుండడం తోపాటు ఒక్కసారిగా పెద్దశబ్దం రావడంతో పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకేసారి దాదాపు మూడు మీటర్ల మేర పైనుంచి కాంక్రిట్ పెచ్చులు పడిపోవడంతో భూకంపం వచ్చినట్లుగా భారీ శబ్ధం రావడంతో సోరంగంలో భారీ శబ్ధంతో ప్రమాదం చోటు చేసుకున్నది.
ఈ తీవ్రత వల్ల దాదాపు వెయ్యి క్యూబిక్ మీటర్ల రాళ్లు, మట్టి పెరుకుపోయాయి. దీంతో ఆందోళనలో ఉన్న కార్మికులు, ఇంజినీర్లు మిషనరీ వదిలేసి దాదాపు 42మంది కార్మికులు, ఇంజినీర్లు బయటకు పరుగులు తీశా రు. బయటకు రావడంతోపాటు వీలున్నంతవరకు సిబ్బం దిని బయటకు తీసుకొచ్చారు.150మీటర్ల వరకు ప్రమాద తీవ్రత కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ భారీ ప్రమాదంలో కార్మికులు, ఇంజినీర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీసీ ప్రాణాలు కాపా డుకు న్నారు. అందరు సురక్షితంగా బయటపడగా నలుగు రు కార్మికులకు స్వల్ప గాయాలు కావడంతో జెన్కో దవాఖా నలో చికిత్స అందించారు.
భారీగా కూలీపడిన పెచ్చులు, మట్టి పెల్లలు, కాంక్రీట్ పెల్లలతోపాటు టన్నెల్లో నీరు చేరి పోవడంతో టన్నెల్ బ్లాక్ అయిందని అధికారులు అంటు న్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోగా తర్వాత సరఫ రాను పునరుద్ధరించారు. టన్నెల్ బోర్మిషన్ మీద ఉన్న వారు, వెనుకభాగంలో ఉన్నవారు, బయటకు రాగలిగారు. మిషన్ ముందుభాగంలో ఉన్నవారు అందులో చిక్కుకున్నారు. లోపల చిక్కుకున్న వాళ్లు కూడా బయటకు వస్తారని ఎదురుచూశారు. కాని ఎంతసేపటికీ వారు రాకపో వడంతో లోపల ప్రమాదంలోనే చిక్కుకున్నట్లు భావించిన కంపెనీ అధికారులు వారిని బయటకు రప్పించేందుకు చేసిన ప్రయ త్నాలు ఫలించలేదు. టన్నెల్ తవ్వకాలు మొద లుపెట్టిన ఏజెన్సీ నిర్వాహకులు చెప్పే కథనం ప్రకారం.. అకస్మాత్తుగా లోపలికి నీరు, మట్టి 8కిలోమీటర్ల మేర రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావించాల్సి ఉంటుందని తెలిపారు.
ఘటనా స్థలిని పరిశీలించిన మంత్రులు, ఎంపీ
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాష్ట్ర నీటి పారుదల, పౌర సర ఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం దో మ లపెంట వద్ద ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకొని హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా ఘటనా స్థలికి చేరుకు న్నారు. ఘటనాస్థలిని పరిశీలించడంతోపాటు లోపల చిక్కుకున్న వారిని కాపాడడం కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు దోమలపెంటలోని జేపీ గెస్ట్‌హౌజ్‌లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తెలంగాణ అ గ్నిమాపక, రెస్క్యూటీం డీజీ నారాయణరావు, ఐజీ సత్య నారాయణ, కలెక్టర్ బాదావత్ సంతోష్, రాబిన్ సంస్థకు చెందిన లెన్ మైనార్ట్తో సమీక్ష నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎనిమిదిని సురక్షితంగా కా పాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తుం దన్నారు. అందుకు సింగరేణికి చెందిన రెస్క్యూటీంలు రంగంలోకి దిగాయని, భారత ఆర్మీకి చెందిన రెస్క్యూటీంలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడామని ఈ రాత్రి వరకు ఆ టీం దోమలపెంటకు చేరుకుంటుందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఈ తరహా ప్ర మాదం చేసుకున్నప్పుడు రంగంలోకి దిగి ప్రాణాపాయం లేకుండా కాపాడిన టీంను కూడా రంగంలోకి దింప నున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో సహాయ, సహకారాలు అంది స్తున్నాయన్నారు. సాయంత్రం ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.
చిక్కుకున్న ఉద్యోగులు, కార్మికులు వీరే..
టన్నెల్ ప్రమాదంలో లోపల చిక్కుకున్న 8మంది ఉ ద్యోగులు, కార్మికుల వివరాలను కంపెనీ అధికారులు వెల్ల డించారు. మనోజ్‌కుమార్ ఉత్తరప్రదేశ్, శ్రీనివాస్ ఉత్తర ప్రదేశ్, సందీప్సాహూ కార్మికుడు జార్ఖండ్, జటాక్స్ కార్మి కుడు జార్ఖండ్, సంతోష్సాహూ కార్మికుడు జార్ఖండ్, అనూ జ్సాహూ కార్మికుడు జార్ఖండ్, సన్నీసింగ్ కార్మికుడు జమ్ము కశ్మీర్, గురుప్రీత్‌సింగ్ కార్మికుడు పంజాబ్ ఉన్నారు.
శ్రమిస్తున్న అధికార యంత్రాంగం
సమాచారం అందిన వెంటనే కలెక్టర్ బాదావతసంతోష్, ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ దోమలపెంటకు వెళ్లి సభాస్థలిని పరిశీలించారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ డీజీ ఆధ్వ ర్యంలో రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. ఐజీ సత్య నారా యణ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టారు. నీటి పారుదల అధికారులు ఎప్పటిక ప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన వైద్యసేవల కోసం వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. ఆర్మీ రెస్క్యూటీం, సింగరేణి రెస్క్యూటీం టన్నెల్లో ఈ తరహా ఘటన చోటు చేసుకున్నప్పుడు కాపాడే రెస్క్యూ టీంలు రాత్రికి చేరుకోనున్నాయని అధికారులు తెలిపారు. అధికార యంత్రాంగం రాత్రిమొత్తం అక్కడే ఉండి సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.