నేడు 150 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం
కళాశాల డైరెక్టర్ నవకళ్యాణి, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 20: తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్‌నగర్‌లో మంగళవా రం 150 మంది డాక్టర్లు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోనున్నారని మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ క ళాశాల డైరెక్టర్ డాక్టర్ నవకళ్యాణి, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేశారని గుర్తుచేశారు. మొదటి బ్యాచ్ 2016 సంవత్సారానికి చెందిన 150 మంది వైద్య విద్యార్థులుగా మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించడంతోపాటు నేడు వై ద్యులుగా పట్టా అందుకోనున్నారన్నారు. ఉస్మాని యా, గాంధీ తర్వాత మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాల రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. 150 సీట్లతో కళాశాల ప్రారంభమైందని, 2018 ఆల్ ఇండియా కోటాలో అదనంగా 25 సీట్లను ప్రభు త్వం పెంచడంతో 2019లో 175 సీ ట్లకు పెరిగిందన్నారు.
మెడికల్ కశాశాల రావడంతో 350 పడకలు గా ఉన్న జనరల్ దవాఖాన 900 పడకల స్థాయికి పెరిగిందన్నారు. అతి త్వరలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో పాత కలెక్టరేట్లో 1200 పడకల దవాఖానకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ప్రసవాలలో మహబూబ్‌నగర్ దవాఖాన రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. వైద్య విద్యార్థులు పొందడానికి డాక్టర్ అశోక్‌రెడ్డి, డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. గ్రాడ్యూయేషన్ కార్యక్రమానికి అతిథులుగా మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ హాజరుకానున్నారన్నారు. సమావేశంలో అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్ ప్రకాశ్, ఆర్ఎంవోలు వంశీకృష్ణ, సిరాజుద్దీన్, స్వప్నిల్, శ్రీజా ఉన్నారు.