జడ్చర్ల, మే 16 : అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి వారిని మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే గద్దె దిగాలని జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు లు, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన వంటనే డిసెంబర్ 9వ తేదీన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా రుణమాఫీపై పూటకో మాట మాట్లాడుతూ కాలం వెల్లదీస్తున్నారన్నారు.
అదేవిధంగా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు బోనస్‌గా రూ.500ఇస్తామని ఇప్పుడేమో సన్నరకం ధాన్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని అంటున్నారని, దొ డ్డురకాలకు కూడా బోనస్ ఇవ్వాలన్నారు.
హామీలు ఇచ్చేటప్పుడే వాటిని అమలు చేస్తామా లేదా అని ఆలోచించుకోవాలని, మీ చేతగాని తనం వల్ల రైతు లు, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇ ప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల ను వెంటనే అమలు చేయాలని లేదంతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, లత, జ్యోతీకృష్ణారెడ్డి, నర్సింహులు, మురళి, ఇమ్మూ, మాజీ సర్పంచులు ప్రణీల్‌చందర్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఉపసర్పంచ్ రవి, నాయకులు శ్రీకాంత్, రం జిత్బాబు, సత్యం, శంకర్‌నాయక్, నాగిరెడ్డి, గిరి, శ్రీనివాస్‌యాదవ్, విజయ్, వెంకటరమణ, పర్మటయ్య, అంజిబాబు, కార్య కర్తలు, రైతులు పాల్గొన్నారు.