మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 16 : హైదరాబాద్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన హె చ్‌సీఏ అండర్-14 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో పాలమూరు జట్టు శుభారంభం చేసింది. మొ యినాబాద్లోని వన్ చాంపియన్‌షిప్ గ్రౌండ్-2లో హైదరాబాద్‌లోని సెయింట్ ఆంటోని స్కూల్ జట్టు తో జరిగిన మొదటి మ్యాచ్‌లో జిల్లా జట్టు 445 ప రుగుల తేడాతో గెలుపొందింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి న మహబూబ్‌నగర్ జట్టు 47 ఓవర్లలో 3 వికెట్లు కో ల్పోయి 468 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ గున్న కేతన్ కుమార్ యాదవ్ 136 బంతుల్లో 26 ఫోర్స్, సిక్సర్ సాయంతో 235 పరుగులతో నాటౌట్‌గా ని లిచి సత్తా చాటాడు.
అలాగే మిగితా క్రీడాకారులు శ్రీహర్షిత్ 75 నాటౌట్, ఆకారం హర్షిత్ 62, సాయి రాం 32, మాలిమ్ అర్హన్ 30 రాణించగా.. 34 ప రుగులు ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. 469 పరు గుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ ఆంటోనీ జ ట్టు మహబూబ్‌నగర్ జట్టు బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. 11.1 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇందులో 8 పరుగులు ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. జిల్లా జట్టు బౌలర్లు సోహెల్ 7, వెంకట్‌సాగర్ 3 వికెట్లు తీశారు. కాగా మహబూబ్‌నగర్ జిల్లా చర్లపల్లికి చెందిన కేతన్ జ డ్చర్ల స్వామినారాయణ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. డబుల్ సెంచరీతో మెరిసి న క్రీడాకారుడిని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజ శేఖర్, కోచ్ అబ్దుల్లా అభినందించారు.