మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఆగస్టు 12 : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి చెందిన అద్దె వ్య వహారంలో బినామీల దందా కొనసాగుతున్నది. రాజ కీయ పలుకుబడి ఉన్న కొందరు అధికారులతో కుమ్మ క్కై మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్నారు. తక్కు వ అద్దెకు దుకాణలను తీసుకొని అధిక అద్దెలకు వ్యా పారులకు ఇచ్చి ఏటా రూ.లక్షల ఆదాయం పొందు తున్నారు. కొందరు వ్యాపారులు రెండు, మూడేం డ్లుగా దుకాణాలకు అద్దెలు చెల్లించకపోయినా అడిగే నాథుడు కరవయ్యాడు. వారిపై పురపాలిక అధికా రులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అను మానాలకు తావిస్తోంది. అధికారుల నిర్వాకంతో ఇటు పేద వ్యాపారులకు, అటు పురపాలిక అదాయానికి న ష్టం జరుగుతున్నది.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ఆదాయ వనరుల కో సం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్, మార్కెట్, న్యూ టౌన్, పద్మావతి కాలనీ, తదితర ప్రాంతాల్లో పలు చో ట్ల ఇరువైపులా వందలాదిగా దుకాణాలు నిర్మించారు. ఇవన్నీ ప్రధాన రహదారి వెంట వ్యాపారాలకు అ నుకూలంగా కట్టించినవే. దుకాణాల కొలతల ఆధా రంగా వాటికి అద్దెలను ఖరారు చేశారు. ప్రైవేట్ దు కాణాలతో పోలిస్తే వీటి అద్దె చాలా తక్కువగానే ఉంది. మున్సిపల్ అద్దె దుకాణాలకు సరాసరి రూ.5వేల నుం చి 12వేల వరకు అద్దె నిర్ణయించారు.
మున్సిపాలిటీ పరిధిలోని అద్దె దుకాణాల రిజర్వేషన్ టెండర్ల ద్వారా కేటాయిస్తారు. నిరుపేదలు, నిరుద్యోగు ల జీవనోపాధి పెంపులో భాగంగా కేటాయించే ఈ దు కాణాలను కొందరు బడాబాబులు సైతం రిజర్వేషన్ కేటగిరిలో పొందడం విడ్డూరం. దుకాణాలను తమ పేరిట పొందిన వారు సబ్ లీజుకు ఇచ్చి అక్రమంగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఓ పేరు మోసిన డాక్టర్ తన పేరిట దుకాణం పొంది దాన్ని సబ్లీజుకు రూ.40 వేలకు పైబడి ఇస్తూ.. మున్సిపాలిటీకి మాత్రం రూ.9 నుంచి రూ.12వేలు మాత్రమే చెల్లిస్తున్నాడు.
మున్సి పల్ అధికారులకు ఈ విషయం తెలిసినా.. అద్దె ఠం ఛన్గా చెల్లిస్తున్నారు.. లేనిపోని తంటాలు మాకెం దుకు.? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా చాలా మంది బడాబాబులు తాము పొందిన దుకాణాలను సబ్లీజుకు ఇచ్చి ఆదాయం పొందుతుండటం విశే షం. దుకాణాలు పొందిన వారిలో 50శాతం మం ది ఒక్కో దుకాణాన్ని రూ.12 నుంచి రూ.15వేలకు ద క్కించుకున్న వ్యక్తులు.. బినామీలకు ఒక్కోదానిని రూ.30 నుంచి రూ.40వేలకు పైగా అద్దెకు ఇచ్చి సొ మ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరు దుకాణాలు ద క్కించుకున్న యజమానులు బినామీలకు అద్దె ఇస్తూ అదనంగా రూ.కోట్లు దండుకుంటున్నారు.
మున్సిపల్ గెజిట్ ప్రకారం షాపులను ఎవరైతే వే లంలో దక్కించుకున్నారో వారే వ్యాపారం చేయాలి. అదేవిధంగా దుకాణంలో మద్యం, మాంసం వ్యాపా రాలు నిర్వహించకూడదు. దుకాణాలను ఇతరులకు లీజుకివ్వకూడదు. సబ్ లీజ్ పేరిట ఒప్పందం చేసు కునేందుకు వీలు లేదు. కానీ మహబూబ్‌నగర్ ము న్సిపాలిటీ దుకాణాల్లో సగం మంది బినామీలు వ్యా పారం చేస్తున్నారు. దుకాణం దక్కించుకున్న యజమా ని మున్సిపాలిటీకి చెల్లించాల్సిన అద్దె చెల్లిస్తారు. బి నామీలకు రెండింతలు, మూడింతలు ఎక్కువగా అద్దెకు ఇస్తూ మిగిలిన ఆదాయాన్ని జేబులో వేసు కొంటున్నారు. ఇంకొందరు బకాయిలు పేరుకుపోగానే దుకాణాలకు తాళాలు వేసి ముఖం చాటేస్తున్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 220దుకాణాలకు గానూ ఇప్పటి వరకు రూ.26కోట్లు అద్దె బకాయిలు ఉన్నాయి. కొన్ని దుకాణాల అద్దె బ కాయిలు పరిశీలిస్తే న్యూటౌన్‌లోని ఓ దుకాణం రూ.56,16,000లు బకాయి ఉండటం విశేషం. మ రో దుకాణం రూ.4,06,916లు చెల్లించాల్సి ఉండగా, ఇంకో దుకాణం రూ.5,73,344లు చెల్లించాల్సి ఉం ది.
ఈ స్థాయిలో బకాయిలు పేరుకు పోతున్నా.. సం బంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ నెలా ఖరు నాటికి అద్దెలు వసూలు చేయాలంటూ ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిపై మున్సిపల్ అధి కారులు ఆయా దుకాణాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ రెవెన్యూ అ ధికారులను సంప్రదించగా.. నెలాఖారులోగా అద్దె చెల్లించకపోతే టెండరు రద్దు చేసి దుకాణాలు ఖాళీ చేయించి ఇతరులకు కేటాయిస్తామని తెలిపారు.