నెట్వర్క్ మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలపై సర్కారు మరోసారి ఉక్కుపాదం మోపింది. బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లకుండా అడుగడుగునా అడ్డుకున్నది. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం రైతులు తలపెట్టి న ‘చలో ప్రజాభవన్’కు వెళ్లకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. కర్షకులకు మద్దతిచ్చేందుకు వె ళ్తారన్న సమాచారంతో పలువురు నేతలను ఎక్కడికక్క డ నిర్భందించారు.
కొందరిని బుధవారం రాత్రి.. మరికొందరిని గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఇండ్ల వద్దకు వెళ్లి వాహనాల్లో బలవంతంగా పోలీస్స్టేషన్లకు తరలించారు. దీంతో గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాణాల వద్దే పలువురు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. రుణమాఫీ కాలేదని రైతులు గగ్గోలు పెడుతుంటే సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు.