మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 1: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆ ధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ లో సోమవారం ఎస్జీఎఫ్ అండర్-17 బాల,బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, డీఈవోతో కలిసి ప్రారంభించారు. మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ మైదానంలో బాలికలకు, శ్రీరామ ల్యాండ్‌మార్క్‌లో బాలుర పోటీలు నిర్వహించారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లా జట్లు టో ర్నీలో పాల్గొన్నాయి.
జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీలో మహబూబ్‌నగర్ బాల, బాలికల జట్లు శుభారంభం చేశాయి. బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు నల్లగొండపై 15-04, ఆదిలాబాద్‌పై 15 -08 గోల్స్ తేడాతో గెలిచించి. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు మెదక్‌పై 8-6, హైదరాబాద్‌పై 10-09 గోల్స్ తే డాతో గెలిచింది. బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు నల్లగొండపై 9-8, కరీంనగర్ జట్టు ఖమ్మంపై 10-06, ఆదిలాబాద్ జట్టు ఖమ్మంపై 11-06, నల్లగొండ జట్టు కరీంనగర్‌పై 12- 08, వరంగల్ జట్టు రంగారెడ్డిపై 11-05, వరంగల్ జట్టు మెదక్‌పై 9-8, నిజామాబాద్ జట్టు 10-05 గోల్స్ తేడా గెలిచాయి. బాలికల విభాగంలో ఆదిలాబాద్ జట్టు ఖమ్మం పై 07-06, కరీంనగర్ జట్టు నిజామాబాద్‌పై 11-05, హైదరాబాద్ జట్టు మెదక్‌పై 9-6, వరంగల్ జట్టు నల్లగొండపై 13-01, హైదరాబాద్ జట్టు నల్లగొండపై 8-2 గోల్స్ తేడాతో గెలిచాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ రష్మిత, ఏఎంవో బాలుయాదవ్, సీఏవో శ్రీనివాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేశ్‌బాబు, ఎస్జీఎఫ్ మాజీ సెక్రటరీ సురేశ్‌కుమార్, మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ రాజేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శాంత, టోర్నీ ఆర్గనైజర్ జీయావుద్దీన్, పీఈటీలు వేణుగోపాల్, బాలు, నిరంజన్‌రావు, ఆసిఫ్, అనిల్ పాల్గొన్నారు.