
ప్రస్తుతం 3.301 టీఎంసీల నీటి నిల్వ
పూర్తి స్థాయి నీటిమట్టం 100.855 టీఎంసీలు
భారీ వరద వస్తేనే నీటి ప్రవాహం
నిండితేనే కర్ణాటక, ఏపీ, తెలంగాణకు సాగునీరు
అయిజ, ఏప్రిల్18: కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయ నీటిమట్టం డెడ్స్టోరీజీకి చేరువలో ఉంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలకు సాగునీటికి వరదాయినిగా ప్రసిద్ధిగాంచిన ఈ డ్యాం నేడు నీరులేక వెలవెలబోతోంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగభద్ర జలాశయం గతేడాది ఎగువన వానలు అంతంత మాత్రం కురవడంతో డ్యాం నీటిమట్టం తగ్గిపోయింది. ప్రస్తుతం 3.301 టీఎంసీలుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 4.744 టీఎంసీలు నిల్వగా నమోదైంది. ప్రస్తుతం డ్యాంలోని నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా రైతులు నైరుతి రుతుపవనాలపై ఆశలు పెట్టుకున్నారు. డ్యాం పూర్తిగా నిండితేనే దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి.
భారీ వరదలు వస్తేనే..
ఈ ఏడాది తుంగభద్ర జలాశయం ఎగువన భారీ వానలు కురిసి వరదలు వస్తేనే టీబీ డ్యాం నిండుకుంటది. డ్యాం నిండితేనే దిగువకు నీటిని విడుదల చేస్తే కర్ణాటక, ఏపీ, తెలంగాణ రైతులు పంటలు సాగు చేసేందుకు సమాయత్తమవుతారు. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంత రైతులు డ్యాం నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. తుంగభద్ర నది పూర్తిగా ఒట్టిపోవడంతో పశుపక్షాదులకు సైతం చుక్కనీరు లభించడంలేదు. రైతులు వానకాలం పంటలు సాగు చేయాలంటే తుంగభద్ర నదికి నీటి ప్రవాహం వస్తే బాగుంటుందని రైతులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నన్ను విడిచి వెళ్లకు..లావణ్యత్రిపాఠి పోస్ట్ వైరల్
IPL 2021: భారీ లక్ష్య ఛేదనలో కోల్కతాకు షాక్