ఊరుకొండ : ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyotirao Phule) జయంతి వేడుకలను ఊరుకొండ, ధన్వాడలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఊరుకొండ మండల కేంద్రంలోని 167 జాతీయ రహదారిపై ( National Highway ) మండల ప్రధాన కూడలిలో నవ భారతి అసోసియేషన్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గుడియానిపల్లిలో ఎమ్మార్పీఎస్ ( MRPS ) ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు.
ధన్వాడ జ్యోతిరావు విద్యాభివృద్ధి కమిటీ సారథ్యంలో శుక్రవారం జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ధన్వాడలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేసి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు మాధవరెడ్డి, రామచంద్రయ్య, గోవర్ధన్ గౌడ్, రెహమాన్ ఖాన్, రాఘవేందర్ రెడ్డి, పటేల్ నరసింహులు, ఇర్ఫాన్ ,రాఘవేందర్ నాయుడు, జడల బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు .