భూత్పూర్ : మహాత్మా బసవేశ్వరుని (Mahatma Basaveshwara) సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy) కోరారు. బుధవారం మహాత్మా బసవేశ్వరుడి జయంతి సందర్భంగా మండల వీరశైవ సంఘం ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని చౌరస్తాలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై, బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 892 సంవత్సరాల క్రితం నాటి సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉండేవి. అందులో ముఖ్యంగా కుల, వర్ణ, లింగ బేధాలు ఉండేవి. వీటన్నిటిని రూపుమాపాలని ఆ కాలంలో ప్రత్యేక ఉద్యమాన్ని చేసిన మహనీయుడని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల వీరశైవ సమాజం అధ్యక్షుడు కోరే నాగరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తూర్ బసవరాజ్ గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణ గౌడ్, ఆ సంఘం సభ్యులు రాజశేఖర్, ప్రభు లింగం, రవి శంకర్, వివిధ పార్టీల నాయకులు మురళీధర్ గౌడ్, సత్య గౌడ్, గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.