మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth reddy) పర్యటనను జర్నలిస్టులు బహిష్కరించారు ( CM Tour Boycott) . సంబంధిత జిల్లా పౌర, సమాచార సంబంధాల శాఖ అధికారి నిర్లక్ష్యం వల్ల అమర్ రాజా కంపెనీ యాజమాన్యం మీడియాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా ఫ్రెండ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరోలు, స్టాఫర్లు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు , ఇండిపెండెంట్ జర్నలిస్టులు బైకాట్ చేశారు. జర్నలిస్టులకు కనీస సౌకర్యం కల్పించలేదని జర్నలిస్టులు ఆరోపించారు.