భూత్పూర్, జూలై 29 : అధికారం కోసమే బీజేపీ గోస పడుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తమొల్గరలో శుక్రవారం 61మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టారన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలతోపాటు అవార్డులు ఇస్తుంటే ఇక్కడున్న బండి సంజయ్, అరవింద్ తప్పుబట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులు, మహిళలకు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టకుండా.. ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం కొత్తమొల్గరలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, ఈద్గా ప్రహరీ, సీసీ పనులను ఎమ్మెల్యే ఆల, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు భూత్పూర్ మున్సిపాలిటీలో మొక్కలు నాటారు. ము న్సిపాలిటీ సిబ్బందికి రక్షణ కోసం దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ శేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, సర్పంచ్ వెంకటమ్మ, మత్స్యసహకార సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, ఎంపీడీవో మున్ని, ఎంపీటీసీ రమణి, కమిషనర్ నరుల్నజీబ్, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, నాయకులు నారాయణగౌడ్, మురళీధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, రాములు, సర్పంచులు పాల్గొన్నారు.