మహబూబ్‌నగర్, జూలై 26 (నమస్తే తె లంగాణ ప్రతిని ధి) :దళితబంధు పథకంతో ఉమ్మడి జిల్లాలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈ స్కీం ద్వారా వివిధ రకాల యూనిట్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ పథకంతో సామాజిక గౌరవం మరింత పెరిగిందని దళితవర్గాలు అంటున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో యూనిట్‌కు రూ.10లక్షలు కేటాయించడంతో కుటుంబం మొత్తం జీవితంలో స్థిరపడుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర వేశపెట్టిన దళితబంధు ప థకం ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నది. సా మాజిక గౌరవం మరింత పెరిగిందని దళితవర్గాలు అంటున్నాయి. స్వయం ఉపాధి పొందుతున్న లబ్ధిదారులు ఆ నందంలో మునిగితేలుతున్నారు. నియోజకవర్గంలో వంద మందికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారకొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో దాదాపుగా 80 నుంచి 90 శాతం వరకు ఈ పథకం కింద లబ్ధి పొందారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 180 యూనిట్లు మంజూరుకాగా, ఇప్పటివరకు 102 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. చాలా మంది కార్లు, ట్రాక్టర్లు, పౌల్ట్రీఫాం, వ్యవసాయ పనిముట్ల అమ్మకం, హార్డ్‌వేర్‌తోపాటు ఇతర వ్యాపారాలను ఏర్పర్చుకున్నారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రారంభించారు. కలెక్టర్లు కూ డా దుకాణాలను పరిశీలిస్తున్నారు. దీంతో దళితబంధు పథకం అంచనాలకు మించిపోయింది.
చారకొండలో పైలట్ ప్రాజెక్టు..
దళితబంధు పథకం అమలు చేసేందు కు చారకొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలంలో అన్ని కుటుంబాలకూ ఈ పథకాన్ని వర్తింపజేశా రు. 1,017 మందికి రూ.1.45 లక్షల చొ ప్పున కేటాయించి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇప్పించారు. మరో 365 మంది దళితుల కు వ్యవసాయం, పౌల్ట్రీ, గొర్రెల పెంపకా న్ని ఏర్పాటు చేసుకునేందుకు రూ.పది ల క్షల చొప్పున యూనిట్లు కేటాయించారు. ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూర్చడంతో పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యింది.
నియోజకవర్గానికి వంద యూనిట్లు..
దళితబంధు పథకాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి వంద యూనిట్లను మంజూరు చేసింది. కలెక్టర్ల ఆదేశాలతో ఎస్పీ కార్పొరేషన్ అధికారులు గ్రామాల్లో సర్వేలు చేపట్టారు. ఆ యా గ్రామాల్లో ఎంతమంది దళితులు ఉ న్నారు..? వారి కుటుంబ ఆర్థిక పరిస్థితితో కూడిన నివేదిక తయారుచేశారు. వాటి ఆధారంగా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన కు టుంబాలకు నేరుగా రూ.10 లక్షల సా యాన్ని ప్రభుత్వం తరఫున అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారులు ఏ యూనిట్ కావాలో నిర్ణయించుకుని అధికారులను కలిసిన తర్వాత మంజూరు చేస్తున్నారు.
గ్రామాలు, పట్టణాల్లో వ్యాపారాలు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది డెయిరీ ఫాంల కోసం గుజారాత్ వెళ్లి నాణ్యమైన పాడిపశువులను తీసుకొస్తున్నారు. అధికారులు లబ్ధిదారులు ఏర్పా టు చేస్తున్న యూనిట్లను తనిఖీ చేస్తున్నా రు. పథకం విజయవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. కాగా, లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలు కళకళలాడుతున్నా యి. నిత్యం ఫుల్ గిరాకీ ఉందని వారు చెబుతున్నారు. ప్రతిరోజూ ఆదాయం కం డ్ల చూస్తున్నామంటున్నారు. ఆయా దుకాణాల్లో అధికారులకు కావాల్సిన మెటీరియల్ కొనుగోలు చేసేలా ఉన్నతాధికారు లు ఆదేశాలు ఇస్తున్నారు. కలెక్టర్లు మానిటరింగ్ చేస్తున్నారు.
ఎనిమిది మంది కలిసికట్టుగా..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లిలో ఎనిమిది మంది లబ్ధిదారులు కలిసికట్టుగా హార్డ్‌వేర్, సిమెంట్ షా పును ప్రారంభించారు. ఈ దుకాణాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. రూ.80లక్షల పెట్టుబడితో చేపట్టిన దుకాణాన్ని ఇటీవల కలెక్టర్ వెంకట్రా వు సందర్శించారు.
అప్పుడు డ్రైవర్.. ఇప్పుడు యజమానిని..
గతంలో నేను డ్రైవర్‌గా పనిచేసేవాడిని. ట్రాక్టర్ పనులు లేని సమయంలో కూలీ పనిచేస్తూ జీవనాన్ని కొనసాగించేవాడిని. దళితబంధు పథకంతో నా రాత మారింది. సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేశా. సొంత పనులు చేసుకోవడమే కాకుండా కిరాయిలకు కూడా వెళ్తున్నాను. కిరాయిల ద్వారా వచ్చే డబ్బుతో కుటుంబజీవనం సాఫీగా ఉన్నది. డ్రైవర్‌గా పనిచేసే నేను సీఎం కేసీఆర్ పుణ్యామా అని నేడు యజమానిగా మారా. ఇది కలలో కూడా ఊహించలేదు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సార్లకు ప్రత్యేక ధన్యవాదాలు.
– కొత్త తిర్మలయ్య, కొల్లంపల్లి గ్రామం, నారాయణపేట మండలం
దుకాణ
కూలికి వెళ్లేవాడిని. సెంట్రింగ్, ఇటుకలు మోసే పనిచేస్తుంటే దళితబంధు పథకం నా తలరాతనే మార్చింది. ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షలతో ఏం చేయాలని ఆలోచిస్తూ.. నాకు వచ్చిన పనినే చేద్దామనుకొని సెంట్రింగ్ బిజినెస్ పెట్టా. రూ.8లక్షలతో సామాన్లు కొనుగోలు చేశా. మిగతా రూ.2లక్షలతో ఒక షెడ్డు వేసుకొని దుకాణం నడుపుతున్నాను. నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నాను.
– వెంకట్రాములు, బోయపల్లి, మహబూబ్‌నగర్
కారు కొనుగోలు చేశా..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దళితబంధు ఆర్థిక సాయంతో సొంతంగా కారు కొనుక్కొని నడుపుకుంటున్నా. కిరాయిలకు నడుపుకుంటూ జీవనం గడుపుతున్నా. ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే దళితబంధు పథకం ఆదుకున్నది. నాలాంటి పేదలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
– మధు, బొందలపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా
విభిన్నమైన యూనిట్లు ప్రవేశపెట్టాం..
దళితబంధు స్కీంను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో విభిన్నమైన ఆలోచన చేసి గ్రూప్ యూనిట్లను ప్రోత్సహించాం. ఎనిమిది, పది మంది కలిపి భారీ పెట్టుబడితో పెద్దపెద్ద వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించాం. అనుకోని విధంగా స్పందన వచ్చింది. ఇలా క్రిస్టియన్‌పల్లిలో ఏర్పాటు చేసిన హార్డ్‌వేర్, పేయింటింగ్ దుకాణాలకు ఫుల్ గిరాకీ అవుతున్నది. సిమెంట్, స్టీల్, పేయింటింగ్, జిరాక్స్, ఇంటర్నెట్, డీజీపీఎస్లాంటి యూనిట్లకు అవకాశం ఇచ్చాం. లబ్ధిదారులంతా ఊహించని రీతిలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది మరింత విభిన్నమైన యూనిట్లను ప్రోత్సహించాలనుకుంటున్నాం.
– ఎస్.వెంకట్రావు, కలెక్టర్, మహబూబ్‌నగర్