నాగర్‌కర్నూల్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ…వలసలను నివారించి పేదల కడుపు నింపే బృహత్తర పథకం. నాటి యూపీఏ ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. సంక్షేమానికి తిలోదకాలిస్తున్న మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జరిగిన తనిఖీలు అధికారులు, కూలీల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఫలితంగా రైతువేదికలు, రైతు కల్లాల పనులపై దెబ్బపడనున్నది. భవిష్యత్తులో ఈ పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఉపాధి హామీ.. వలసలను నివారించి పేదల కడుపు నింపే బృహత్తర పథకం. నాటి యూపీఏ ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సంక్షేమానికి తిలోదకాలిస్తున్న మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జరిగిన తనిఖీలు అధికారులు, కూలీల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఫలితంగా రైతువేదికలు, రైతు క ల్లాల పనులపై దెబ్బపడనున్నది. భవిష్యత్తులో ఈ పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఉపాధి అమలు ప్రశ్నార్థకం
పాలమూరు జిల్లాలో వలసలను ఆపడంలో కీలకమైన ఉపాధి హామీ పథకం అమలు ప్రశ్నార్థకంగా మా రనున్నది. రాజకీయ కక్షతో తెలంగాణలో పథకం పనులపై కేంద్ర బృందాలతో ప్రధాని మోదీ ఆదేశంతో జరిగిన తనిఖీలు అధికారులను, కూలీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక వలసల జిల్లాగా పేరున్న పాలమూరులో ఈ పథకం మంచి మార్పు తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక డీఆర్డీవో శాఖ ద్వారా ప్రతి కూలీకి పని కల్పించేలా స్పష్టమైన పర్యవేక్షణ చేపట్టింది. ఈ క్రమంలో వంద రోజులకు మించి పని దినాలు కల్పించారు. ఫలితంగా కూలీలు సొంతూళ్లలోనే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎంజీకేఎల్ఐలాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో సాగునీటి వనరులు, వ్యవసాయం పెరిగి ఉపాధి కల్పన జరుగుతున్నది. ఈ క్రమంలో రాజకీయ ఉద్దేశంతో కేంద్రం ఇటీవల చేపట్టిన తనిఖీలు అధికారుల్లో అలజడి రేపింది.
గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు తనిఖీలు చేపట్టడం గుబులు రేపుతున్నది. పాలమూరు వలసలు తిరిగి మొదలవుతాయని మేధావులు అనుమానిస్తున్నారు. ఈ తనిఖీల్లో ముఖ్యంగా చెరువులు, కందకాల పనులపై అధికారులు జిల్లాలోని ఐదు గ్రామాల్లో తనిఖీలు చేశాయి. ఉపాధి హామీలో గ్రామ సభ ఆమోదం నుంచి సామాజిక తనిఖీ వరకు పారదర్శకంగా రాష్ట్రంలో పనుల అమలు జరుగుతున్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పనులను పర్యవేక్షిస్తున్నాయి. కేంద్ర అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు. కార్యదర్శులు పనులను నిర్వహిస్తుండడంతో జవాబుదారీతనం కూడా పెరిగింది. అడిగిన ప్రతి కూలీకి పనులు కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 461 పంచాయతీల్లోనూ వన నర్సరీలు, 662 పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, రైతు వేదికలు, రైతు కల్లాలను నిర్మించారు.
ఇప్పటికే వరి కొనుగోళ్లు, మెడికల్ కళాశాలల మంజూరు, పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, జిల్లాకు మాచర్ల-రాయిచూర్ రైల్వే సర్వేపై నిర్లక్ష్యంతో కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 2.06 లక్షల మంది కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇవ్వగా 1.14 లక్షల మంది కుటుంబాల్లోని 2,00,840 మంది ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చేపట్టిన తనిఖీలతో రైతు కల్లాలు, రైతు వేదికల పనులపై తక్షణం ప్రభావం పడనున్నది. జిల్లాలో 3,199 రైతు కల్లాలకుగానూ 985 కల్లాలను నిర్మించాలని నిర్ణయించగా రూ.2.05కోట్ల ఖర్చుతో 183 పనులు పూర్తికాగా 802 కల్లాల పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే 143 రైతు వేదికలు ఒక్కొక్కటి రూ.22 లక్షలతో చేపట్టగా ఇందులో రూ.10లక్షలు వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు ఈజీఎస్ నుంచి కేటాయించారు. ఇందులో 10 వేదికలకు నిధులు మంజూరు కావాల్సి ఉన్నది. జిల్లాలోని మంగనూరు, వట్టెం, మొలచింతలపల్లి, ముక్కిడిగుండం, కుడికిళ్ల, పదరలో ఈనెల 18 నుంచి 22 వరకు నాలు గు రోజుల్లో చేపట్టిన తనిఖీలు పథకం మనుగడపై అనుమానాలను కలిగిస్తున్నది.