మహబూబ్‌నగర్ రూరల్, జూలై 25 : నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీ డా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. ఇటీవల వర్షాలకు ఇండ్లు కూలి గ్రా మ పంచాయతీ భవనంలో ఆశ్రయం పొందుతున్న మహబూబ్‌నగర్ మండ లం దివిటిపల్లి గ్రామానికి చెందిన హెచ్. మంజుల, చెన్నారపు మణెమ్మ, ఆర్.బా లకృష్ణకు దివిటిపల్లి డబుల్ బెడ్రూం కా లనీలో ఇండ్లు కేటాయించి వారికి క్యాం పు కార్యాలయంలో పట్టాలను పంపిణీ చేశారు. ఉండేందుకు ఇల్లు లేక కట్టుబట్టలతో గ్రామపంచాయతీ భవనంలో ఆశ్ర యం పొందుతున్న వారిని చూస్తే చాలా బాధగా అనిపించిందని వారిని ఎలాగైనా ఆదుకోవాలని, వారికి ఆశ్రయం క ల్పించాలని వెంటనే ఇండ్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, సర్పం చ్ జరీనా బేగం, నాయకులు పాండురంగారెడ్డి, ముఖరంజా, శేఖర్ ఉన్నారు.
రాష్ట్రంలో పండుగలకు గుర్తింపు..
తెలంగాణ వచ్చాకే మన పండుగలకు గుర్తింపు లభించిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వా త అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. అశేషంగా హాజరైన భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల ఊరేగింపులో పాల్గొని డోలు వాయించారు. అనంతరం బంగారు మైసమ్మ దేవాలయంలో పూజలు చేశారు. మంత్రి మా ట్లాడుతూ బోనాల పండుగకు ప్రభు త్వం సెలవు ప్రకటించిందన్నారు.
ఉర్సు ఉత్సవాలకు హాజరు..
మహబూబ్‌నగర్ టౌన్, జూలై 25 : పట్టణంలోని ఎర్రకుంట, బడేషా బౌళి లో ఉన్న హజరత్ బరాన్- ఈ బాద్షా ద ర్గా ఉర్సు షరీఫ్ గంధోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని పూజలు చేశారు. దర్గాలో చాదర్ సమర్పించారు. అనంతరం దర్గా సమీపంలో రూ.10 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, దర్గా సాయబ్ రయాజ్ పాషా ఖాద్రీ పాల్గొన్నారు.
చల్లగా ఉండు బిడ్డా.. : మంత్రిని దీవించిన వృద్ధురాలు
ఎదిరలో బోనాల పండుగ ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరవుతారని తెలుసుకొని సూద దేవమ్మ అనే వృద్ధురాలు ఊరేగింపు వద్దకు వచ్చింది. పెద్ద ఎత్తున జనం ఉన్నా ఎలాగోలా మంత్రి వద్దకు చేరుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత తనకు రూ.200 ఉన్న పింఛన్ రూ.2016 అయ్యిందని, రైతుబంధు వస్తోందని, మారుమూల గ్రామమైన మా ఊరికి కళ వచ్చింది బిడ్డా అం టూ మంత్రితో తెలిపింది. ఇంతటి అభివృద్ధికి కారణమైన నువ్వు చల్లగా ఉండా లి బిడ్డా అంటూ దీవించింది.