మహబూబ్‌నగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పరిపాలనను మరింత చేరువచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు కొత్త మండలాలకు పచ్చజెండా ఊ పింది. నారాయణపేట జిల్లాలో రెండు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక మండలాన్ని గుర్తిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా మండలాల్లో సం బురాలు మిన్నంటాయి. విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా రు. కొత్త జిల్లాల విభజన తర్వాత చాలా చోట్ల కొత్త మండలాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తున్నది. తాజాగా ఎనిమిది మండలాలు చేయాలనే డి మాండ్ రాగా.. అందులో మూడింటిని ఓకే చేసింది. మరో ఐదు మండలాల ఏర్పాటుకు నిబంధనలు అడ్డు గా మారడంతో ప్రతిపాదనలు ఆగిపోయాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారు.
మండలాల ఏర్పాటు ఇలా..
నారాయణపేట జిల్లా కోస్గి మండలాన్ని విడదీస్తూ గుండుమాల్ మండల కేంద్రంగా మారింది. పాత మండలంలో ఇదే పెద్ద గ్రామపంచాయతీ. అయితే, చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువగా ఉండడంతో జిల్లాల పునర్విభజన సమయంలో మండల కేంద్రంగా చేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న అధికారులు కొత్త మండలకేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే మద్దూరు మండలంలోని కొత్తపల్లి గ్రా మం కూడా మండల కేంద్రానికి దూరంగా ఉంటుంది. చుట్టూ ఉన్న చాలా గిరిజన పల్లెలను కలుపుతూ మం డలకేంద్రంగా ఏర్పాటు చేశారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కౌకుంట్లను కూడా కొత్త మండలంగా మార్చారు. మండలకేంద్రంగా మార్చినందుకు కాంగ్రెస్ సర్పంచ్ స్వప్న, ఆమె భర్త కిషన్రావులతోపాటు అనేక మంది పార్టీ నేతలు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డిని కలిసి సన్మానించారు. ఆయా మండలాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న డిమాండ్లను నెరవేర్చడంతో ఆయా గ్రామాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. మండలకేంద్రాలు చేరువగా ఉండడంతో పాలన గాడిన పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.
మరో ఐదింటికి నిబంధనలు అడ్డంకి..
గతంలో చాలా చోట్ల విపక్షాలు రెచ్చగొట్టి మండలాలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టా యి. దీంతో కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రుపొందించింది. జనాభా, స మీప గ్రామాలు, పంచాయతీలు, ఎంపీటీసీ పరిధులు ఇందులోకి వస్తాయి. కనీసం ఏడు ఎంపీటీసీల పరిధి ఉండాలన్న నిబంధన ప్రధానం. నవాబ్‌పేట మండ లం కొల్లూరు గ్రామాన్ని మండలకేంద్రం చేయాలని చాలా కాలంగా డిమాండ్ వస్తున్నది. అఖిలపక్ష నేతలు ఆందోళనలు చేశారు. అయితే, ఏడుగురు ఎంపీటీసీల మద్దతు అవసరం. కాగా, ఒక్క కొల్లూరు ఎంపీటీసీ మాత్రమే మండలానికి అనుకులంగా ఉన్నారు. మిగ తా ఎంపీటీసీలు విముఖంగా ఉన్నారు. దీంతో మం డల ప్రతిపాదన వెనక్కి వెళ్లింది. గతంలో ఇదే మండలాన్ని ఆనుకొని వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్ గ్రామాన్ని మండలంగా చేశారు.
దీంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని ము గ్గురు ఎంపీటీసీలు, నవాబ్‌పేట మండలంలోని మరో ఇద్దరు ఎంపీటీసీల పరిధిలోని పంచాయతీలు తీర్మానాలు ఇవ్వకపోవడంతో మండల ప్రతిపాదన ఆగిపోయింది. ఇదే క్రమంలో వనపర్తి నియెజకవర్గంలోని వెల్టూరు, కేతేపల్లి, కల్వకుర్తి నియోజకవర్గంలోని రఘుపతిపేట, అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి మండలాల డిమాండ్లు కూడా అలానే ఉన్నాయి. మం డల ప్రతిపాదనలు రాని నేతలతో ఆయా ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారు.