ఒక్కసారి ఆలోచిద్దాం..! ప్లాస్టిక్ కవర్ల వినియోగం వద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా ఎందుకు మారడం లేదని ప్రశ్నించు కుందాం..! పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నామో గమనిద్దాం..! ప్లాస్టిక్ వాడడం వల్ల మనం అనారోగ్యం పాలవడంతోపాటు జంతువులు కూడా మృత్యువాత పడే అవకాశం ఉన్నదనే విషయం మనస్సులో పెట్టుకుందాం..! బయటకు వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక వస్తువును ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకొస్తూనే ఉంటాం..! దానికి బదులు ఒక జ్యూట్ బ్యాగ్ లేదా నిబంధనలు పాటించి తయారీ చేసిన ప్లాస్టిక్ కవర్లను వెంట తీసుకెళ్లి అందులోనే వస్తువులు తెచ్చుకుందాం.. మన వంతుగా అధికారులు, ప్రభుత్వానికి సహకరించి భవిష్యత్ తరాలకు అండగా నిలుద్దాం..!
– అలంపూర్, జూలై 25
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అన్ని ర కాల ప్రయత్నాలు చేస్తున్నది. ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పిస్తున్నది. కానీ, ప్రజల్లో మా ర్పు కనిపించడం లేదు. పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లో సైతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దీంతో డంపింగ్ యార్డుల్లో ప్లాస్టిక్ కవర్లు కుప్పలుకుప్పలుగా పేరుకుపోయాయి. వాతావరణం కాలుష్యమవుతున్నది. బజారులో దొరికే వస్తువులు ఇంటికి తీ సుకొచ్చేందుకు కవర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆయా సంస్థలు తయారుచేసే వ స్తువులు ప్యాక్ చేసేందుకు కూడా ప్లాస్టిక్‌నే వాడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సులువుగా మట్టిలో కలిసిపోయే అవకాశం లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీనిని అరికట్టకపోతే భవిష్యత్ తరానికి ముప్పు వాటిల్లే ప్రమా దం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్లా స్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. అయినా మార్పు అంతంతమాత్రంగానే ఉన్నది. వస్తువుల తయారీ సంస్థలు కూడా సహకరించి భూమిలో కలిసిపోయేలా ప్లాస్టిక్ కవర్ల బదులు నిబంధనలకు లో బడి కాగితపు, బట్ట బ్యాగులు తయారుచేయాలి.
నిత్య వస్తువుగా ప్లాస్టిక్..
నిత్యం వివిధ అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించే ప్లాస్టిక్.. పర్యావరణానికి సవాలు విసురుతున్నది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిఒక్కరూ తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో పూలు, కూరగాయ లు, వంట సరుకులు, తినుబండారా లు, గృహ అవసరాలకు సంబంధించి న సరుకులు.. ఇలా ఏదో ఒక టి కొనుగోలు చేసి ప్లాస్టిక్ కవర్లలో తీసుకొస్తున్నా రు. ప్లాస్టిక్ వాడకం మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ప్లాస్టిక్ వినియోగంతో ముప్పు ఉం దని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా వినియోగదారులు పట్టించుకోవడం లేదు. ఎటు చూసినా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్యాకింగ్ కవర్లు వంటివి రోడ్లు, ఖాళీ స్థలాల్లో కనిపిస్తూనే ఉన్నాయి.
మార్పు ఏదీ..?
నిబంధనల ప్రకారం 50 మైక్రాన్ల కంటే తక్కు వ మందం ఉన్న ప్లాస్టిక్ బ్యాగులు, కవర్లతో ప్ర మాదం ఉన్నది. ప్రభుత్వం 2015 నుంచి మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ కవర్ల నిషేధం విధించింది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు ఉదాసీనతతో వ్యవహరించడంతోనే నిషేధం నామమాత్రంగా అమలవుతున్నది. ప్లాస్టిక్ కవర్లు మురుగుకాల్వల్లో పారవేయడం వల్ల మురుగునీరు ముందుకువెళ్లలేక రోడ్లపై పారుతున్నాయి. ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై జరిమానాలు విధిస్తున్నా.. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజలో మార్పు రావడం లేదు.
ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలు..
ప్లాస్టిక్ వినియోగం తర్వాత ఎక్కడపడితే అక్కడ పారవేయడం ద్వారా అవి మట్టిలో కలిసేందుకు వందల ఏండ్లు పడుతున్నది. దీంతో భూగర్భంలో నీటి నిల్వపై ఆటంకం కలుగుతున్నది. అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్లను పశువులు, జంతువులు తినడం వల్ల జీర్ణం కాక మరణించే ప్రమాదం ఉన్నది. డిస్పోజల్ గ్లాసులు, ప్లేట్లలో వేడివేడి ఆహార పదార్థాలు వేయడంతో అందులో ఉన్న రసాయనాలు కరుగుతున్నాయని, వాటిని తినడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నామని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
జరిమానా విధిస్తున్నాం..
అలంపూర్ మున్సిపాలిటీలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా అమలయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వ్యాపారస్తులకు అవగాహన కల్పించాం. నిబంధనలు పాటించని ఇద్దరు వ్యాపారులకు జరిమానా విధించాం. వారి దగ్గర నుంచి సుమారు రెండు కేజీల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నాం. అధికారులకు ప్రజలు కూడా సహకరిస్తేనే ప్లాస్టిక్ వినియోగం నిషేధించొచ్చు. ప్లాస్టిక్ వినియోగిస్తున్నట్లు తెలిస్తే 70130 03312 నెంబర్‌కు తెలియజేయండి.
– నిత్యానంద్, మున్సిపల్ కమిషనర్, అలంపూర్
ప్రజలూ సహకరించాలి..
ప్లాస్టిక్ నిషేధం అమలులో ప్రభుత్వంతోపాటు ప్రజలూ స్వచ్ఛందం గా భాగస్వామలు కావాలి. మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కవర్ల వినియోగం తగ్గించుకోవాలి. నార సం చులు లేదా నిబంధనలకు లోబడి తయారు చేసిన కవర్లు వాడాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై అవగాహన కల్పించాం. ప్లాస్టిక్ కవర్ల వినియోగం, సరఫరా, తయారీ తదితర అంశాలపై ఫిర్యాదులు, సమాచారం ఇచ్చేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం.
– మనోరమ, మున్సిపల్ చైర్పర్సన్, అలంపూర్