మహబూబ్‌నగర్, జూలై 20: పేద విద్యార్థులకు ఉ న్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా అత్యుత్తమంగా విద్యాలయాలను తీర్చిదిద్దడం జరుగుతుందని, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయికి ఎంపికైన 8, జిల్లా స్థా యిలోనూ 30 స్వచ్ఛ విద్యాలయాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు, విద్యా కమిటీ చైర్మన్లకు, ఉపాధ్యాయులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ విద్యాలయ పాఠశాలల అటెండర్లను సైతం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా సన్మానించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, డీఈవో రవీందర్, గోపాల్ ఉన్నారు.
25న నోటిఫికేషన్
మహబూబ్‌నగర్, జూలై 20 : జిల్లాలో ఖాళీగా ఉన్న 42 చౌకధర దుకాణాల డీలర్ల భర్తీకి ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్దిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ చౌకధర దుకాణాలకు తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. అప్పన్నపల్లి రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జి లింక్ రహదారుల పనులు వెంటనే చేపట్టాలని సంస్థ చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్‌నందలాల్‌పవార్, సీతారామరావు, ముడా చైర్మన్ గంజివెంకన్న, అధికారులు పాల్గొన్నారు.
అప్పుడు అంబేద్కర్.. ఇప్పుడు కేసీఆర్..
మహబూబ్‌నగర్ రూరల్, జూలై 20 : దళితుల కో సం సీఎం కేసీఆర్ మహనీయుడు అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. మన్యకొండ చౌరస్తా వద్ద దళితబంధు లబ్ధిదారులు యాదయ్య, చంద్రయ్యకు మంజూరైన పరిశ్రమ యూనిట్, సెంట్రింగ్ యూనిట్లను ప్రారంభించారు. దేశంలో ఎవరూ చేయని ఆలోచన సీఎం కేసీఆర్ చేశారని దళితబంధు నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, నర్సింహారెడ్డి, దేవేందర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, ఆంజనేయులు, సర్పంచులు ఉన్నారు.