మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 17 : ఎంసె ట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు జిల్లాకేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫాతిమా విద్యాలయం, జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశా రు. 20వ తేదీవరకు పరీక్షలు కొనసాగనున్నాయి. తొలిసెషన్ ఉదయం 9నుంచి మ ధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు ఉం టుంది. మూడు రోజులపాటు ఆరు సెషన్లల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్షాకేంద్రానికి గంటముందే రావాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నిరాకరించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,980మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. జేపీఎన్సీఈలో ప్రిన్సిపాల్ సుజీవన్‌కుమార్, ఫాతిమా విద్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్‌రెడ్డి పరీక్షలను పర్యవేక్షించనున్నారు.