మక్తల్ టౌన్, జూలై17: మక్తల్ నియోజకవర్గ ప్రజలకు సాగునీటికి ఇబ్బందులు కలుగకుండా ఇరిగేషన్ అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో ఖానాపూర్ పంప్ హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్‌కు వెళ్లే క్రమంలో మక్తల్ పట్టణంలోని పెద్దచెరువుకు సాగునీని తరలించేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ దగ్గర గ్రావిటీ కెనాల్ కోతకు గురి కావడంతో పెద్దచెరువుకు సాగునీరు వెళ్లేందుకు మట్టి అడ్డుపడటంతో విషయం తెలుసు కున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణా నదిలో ఎగువన కర్ణాటక ఆల్మట్టి నారాయణ పూర్ నుంచి వరద వస్తుండటంతో ఫేస్ 1 నుంచొ పంప్1 పంప్ 2 ద్వారా మక్తల్ నియోజకవర్గ ప్రజలకు సాగునీటి ఇబ్బందులు లేకుండా వీలుగా చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్‌కు, భూత్పూర్ రిజర్వాయర్‌కు సాగునీరు విడుదలను చేయడం జరుగుతుందని, నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపే క్రమం లో మక్తల్ పెద్దచెరువుకు సాగునీటి విడుదల చేయడం క్రమంలో గ్రావిడీకెనాల్ ద్వారా చెరువుకు వెళ్లే మలుపువద్ద గ్రావిటీకెనాల్ కోతకు గురైంది.
ఇరిగేషన్ అదికారులతో మాట్లాడి పనులు త్వరగా జరగాలని తెలిపారు. 13వందల కూసెక్కుల నీగునీటిని రోజు వారీగా విడు దల చేస్తున్నామన్నారు. అందులో ఐదువందల క్యూసెక్కులు భూత్పూర్ రిజర్వాయర్‌కు, 8వందల కూసెక్కుల సాగునీరు చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్‌కు సాగునీరు చేరుకుంటుందని తెలిపారు. రిజర్వాయర్ల నుంచి ప్రజల అవసరాల నిమిత్తం సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మక్తల్ పెద్ద చెరువు కింద దాదాపు 500 ఎకరాల్లో సాగవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ ఏఈ నాగశివ, మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, గాలిరెడ్డి తదితరులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.