– కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
కల్వకుర్తి, జూలై 17: మతాన్ని రెచ్చకొట్టి ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మతతత్వ బీజేపీని తరిమికొట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ర్టాల హక్కులను హరిస్తూ నియంతృ త్వ పాలనకు తెరలేపిన బీజేపీతో ప్రజాస్వామ్యం ప్రమాదమంచున ఉందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికంతో బాధపడుతున్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధిని కాంక్షించాల్సిన కేంద్రంలోని, రాష్ర్టాల్లోని బీజేపీ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు పట్టం గడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించడం మినహా సా ధించిందేమీ లేద ని దుయ్యబట్టా రు. నీరజ్మోడీ, విజయ్‌మాల్యా, ఆదానీ, అంబానీ, గుజరాత్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు దారదత్తం చేసిన ఘనత ప్రధానిమోడీకే దక్కుతుందని ఎమ్యెల్యే ఆరోపించారు. రూ.42లక్షల ఆసరా పింఛన్లు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదని, ఈ ఆగస్టు నుంచి 11లక్షల కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు అందించనున్నామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు ఇస్తామని తెలిపారు.