నాగర్‌కర్నూల్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : క రోనా నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ మరో అడుగు వేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 18 ఏండ్లు నిం డిన వయోజనులందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు నిర్ణయించింది. శుక్రవారం నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నారు. దీనిపై ఆరోగ్య శాఖ కింది స్థాయి సిబ్బంది ద్వారా ప్రచారం చేసేలా చర్యలు తీసుకుంటున్నది. కరోనా మహమ్మారి క్రమంగా అంతమవుతున్నది. ఇందులో వ్యాక్సిన్ సంజీవనిగా నిలిచింది. జనవరి 16, 2021న తొలి విడుత టీకా ప్రారంభమైం ది. ఆ తర్వాత రెండో విడుత టీకాను మార్చి 1 నుంచి వేశారు. 18 ఏండ్లు దాటిన వారందరికీ ఇచ్చారు. అనంతరం 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు, 15 నుంచి 17 ఏండ్ల లోపు టీనేజర్లకు సైతం విడుతల వారీగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా వేశారు. కరోనా వచ్చాక, రాకముం దు వైద్యుల ధ్రువీకరణతో ప్రజలందరూ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. దీంతో కరోనా దాదాపుగా తుది దశ కు చేరుకున్నది. రాష్ట్ర వైద్య శాఖ సైతం కరోనాను ప్రస్తు తం సీజనల్ వ్యాధిగా పేర్కొంటున్నది. ప్రజలందరూ మాస్క్, శానిటైజేషన్, భౌతికదూరం వంటి కనీస జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచిస్తున్నది. కాగా, ఇప్పటివరకు రెండు విడుతలుగా వ్యాక్సిన్ వేయించుకున్న వారి లో రోగ నిరోధకశక్తి పెరిగి కరోనా ప్రభావం తక్కువైంది.
ఫలితంగా 2021 తర్వాత కరోనా మరణాలు, తీవ్రత క్ర మేణా తగ్గుతూ వచ్చాయి. అయితే ప్రజల్లో మరింత రోగ నిరోధక శక్తిని పెంచి కరోనాను ఎండమిక్ దశకు చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి బూస్టర్ డోస్ ఆయుధంగా నిలుస్తుందని భావించి ఉచితంగా వ్యాక్సినేషన్ వే సేందుకు ఆదేశాలిచ్చింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నది. ఇప్పటికే 60 ఏండ్లు దాటిన వృద్ధులకు బూ స్టర్ డోస్ ఇచ్చారు. అయితే కేవలం 1 శాతంలోపే బూ స్టర్ డోస్ పంపిణీ జరిగింది. ఈ కారణంగా ప్రత్యేకంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రెండు విడుతల వ్యాక్సినేషన్ చేయించుకున్న ప్రజలు బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. బూస్టర్ డోస్ పంపిణీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ వేయనున్నారు. రెండు డోసులు పూర్తయిన ప్రజల ఫోన్లకు బూస్టర్ డోస్ సమాచారం చేరవేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 18 ఏండ్లు దాటిన 6,27,625 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందు లో తొలి విడుతలో 6,51,191, రెండో విడుతలో 6, 49,500 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇక 12 నుం చి 14 ఏండ్లు దాటిన టీనేజర్లు 27,502 మందికి గానూ తొలిడోస్గా 27,840, రెండో డోస్ కింద 27,498 మం దికి టీకా వేశారు. ఇక 15 నుంచి 17 ఏండ్ల మధ్యలోని 44,570 మంది యువతకుగానూ 44,745 మందికి, రెండో డోస్ 44,397 మందికి ఇవ్వడం విశేషం. ప్రజలందరికీ లక్ష్యానికి మించి వ్యాక్సినేషన్ ఇచ్చారు.