మహబూబ్‌నగర్/టౌన్, జూలై 14 : ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై విధించే పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేయడంపై ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయ చౌరస్తాలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్జీ మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలలు మూతపడి తీవ్ర ఇబ్బందులు పడ్డామని తెలిపారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ సకాలంలో పొందకపోతే రోజూవారీగా విధించే పెనాల్టీని ప్రభు త్వం రద్దు చేయడం సంతోషంగా ఉందన్నా రు. ఇందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మం త్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా ప్రతినిధులు అక్తర్‌బేగం, రాములు, అంజిరెడ్డి, హరినాథ్‌గౌడ్, రవికుమార్, నర్సింహారెడ్డి, మహ్మద్హ్రీం ఉన్నారు.