జడ్చర్ల, జూలై 14 : అన్నివర్గాల ప్రజలకు సర్కారు అండగా ఉంటున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని చర్లపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చెన్నకేశవులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య శశికళకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును గురువారం జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అలాగే ఏడుగురికి రూ.5.25లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అ దేవిధంగా గోప్లాపూర్‌కు చెందిన శ్రీపతి ప్రమాదవశా త్తు విద్యుత్ షాక్‌కు గరై మృతి చెందగా, అతడి భార్య శివాంజలికి విద్యుత్‌శాఖ నుంచి మంజూరైన రూ.5ల క్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కా ర్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, రమేశ్, లత, చైతన్య, జ్యోతీకృష్ణారెడ్డి, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్, మాజీ వైస్‌ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మా జీ సర్పంచ్ రేణుక, మురళి, నాగిరెడ్డి, బీకేఆర్, దానిష్, గోపాల్, శంకర్‌నాయక్, విజయ్ పాల్గొన్నారు.
నసరుల్లాబాద్ చెరువు పరిశీలన
మండలంలోని నసరుల్లాబాద్ పెద్దచెరువు అలుగును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించి పూజలు చేశారు. వానకాలం ప్రారంభంలోనే చెరువు నిండి అలుగు పారడంపై ఆనందం వ్యక్తం చేశారు. నసరుల్లాబాద్ పెద్దచెరువు కింద 450 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని, చెరువును మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెరువు కట్టను సుందరీకరించి ఆహ్లాకరమైన వాతావరణం నెలకొల్పుతామన్నారు. అంతకుముం దు గ్రామంలో శివాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచ్ ప్రణీల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సేవాభావం అలవర్చుకోవాలి
టీఆర్ఎస్ కార్యకర్తలు సే వాభావం అలవర్చుకొని పేదలను ఆదుకోవాలని ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు నర్సింహులు జన్మదినం సందర్భంగా మండలకేంద్రంలో మహిళలకు చీరలు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాఘువీరారెడ్డి, ఎంపీపీ సుశీ ల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, ఆనంద్‌గౌడ్, నరహరి, సత్యయ్య, మహిపాల్‌రెడ్డి, రామకృష్ణాగౌడ్, విజయ్ పాల్గొన్నారు.