మక్తల్ టౌన్, జూలై 14: మక్తల్ నియోజకవర్గ ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలో నారాయణపేట క్రాస్‌రోడ్డులో హెచ్డీఎఫ్సీ నూతన బ్యాంకుశాఖను గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఎస్బీఐ రెండు బ్రాంచులు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా నియోజకవర్గ ప్రజల ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగా నూతనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుబ్రాంచి ఏర్పాటు కావడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. వ్యాపార సంస్థలకు లావాదేవీలకు ఇబ్బంది కలుగకుండా సేవలు అందించాలని బ్యాంక్ మేనేజర్ కు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహగౌడ్, ఎస్సై పర్వతాలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి