నివాళులర్పించిన ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నవాబ్‌పేట, జూలై 13 : ఎంపీటీసీల సం ఘం మండల అధ్యక్షుడు, నవాబ్‌పేట ఎంపీటీసీ బోగం రాధాకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృ తి చెందారు. ఎస్సై శ్రీకాంత్ కథనం మేర కు.. ఎంపీటీసీ రాధాకృ ష్ణ మంగళవారం సా యంత్రం కారులో జిల్లాకేంద్రానికి వెళ్లి నవాబ్‌పేటకు వస్తుండగా, రుద్రారం గ్రామశివారులోని గద్దగుండు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రాధాకృష్ణకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. రాధాకృష్ణ గతంలో నవాబ్‌పేటలో వార్డుసభ్యుడిగా ఎన్నికై క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో చేరి పార్టీ బలోపేతానికి పనిచేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రధాన శిష్యుడిగా ఎదిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నవాబ్‌పేట ఎంపీటీసీగా మంచి మెజార్టీతో విజయం సాధించారు.
రాధాకృష్ణ మృతి విషయాన్ని తె లుసుకున్న ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి నవాబ్‌పేటకు చేరుకొని రాధాకృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. టీఆర్ఎస్ పార్టీ మంచి యువనాయకుడిని కోల్పోయిందని తెలిపారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చి సంతాపం తెలిపి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జెడ్పీ వైస్‌చైర్మన్ కోడ్గల్ యాదయ్య, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్‌చైర్మన్ చందర్‌నాయక్, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, సర్పంచులు గోపాల్‌గౌడ్, సత్యం, యాదయ్య, కృష్ణయ్య, ఎంపీటీసీలు గోపాల్, గోపీకృష్ణ తదితరులు సంతాపం తెలిపారు.