జడ్చర్లటౌన్, జూలై 11: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూ ద్ షేక్ సూచించారు. సోమవారం మున్సిపాలిటీలోని 26, 27వ వార్డుల్లో పాత ఇండ్లను మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇండ్ల గోడలను పరిశీలించి, బాధితులకు ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రంగనాయకస్వామి గుట్ట వద్ద ఆలూరు రోడ్డుపై నిలిచిన వర్షపునీటిని జేసీబీతో తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పాతబజార్‌లోని ఊరకుంట చెరువును పరిశీలించా రు. వర్షంతో చెరువు నిండితే ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, ఉమాదేవి, ప్రశాంత్‌రెడ్డి, శశికిరణ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో..
నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్ష ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్‌శాఖ చర్యలు తీ సుకుంటున్నారు. మున్సిపాలిటీలోని రామయ్యబౌలి, శివశక్తినగర్, బీకేరెడ్డికాలనీ, పెద్దచెరువు పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పారిశు ధ్య, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారు లు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాం తాల్లో వర్షం నీరు నిలువకుండా పారిశుధ్య విభాగం అధికారులు 24గంటలు అందుబాటులో ఉన్నారు. నాలాలో చెత్త తొలగిం పు, వర్షపునీరు సరిగా ముందుకెళ్లేలా శ్రమిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది సేవలను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
కోస్గి మున్సిపాలిటీలో..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అ త్యవసరమైతే తప్ప ఇంటినుంచి ఎవరు బయటకు రావద్దని మున్సిపల్ చైర్పర్సన్ శిరీష అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌తో కలిసి సోమవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అం దుకు ప్రభుత్వం పాఠశాలలకు సెలువులు ప్రకటించిందన్నా రు. భారీ వర్షాల కారణంగా పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉ న్న ఇండ్లు కూలే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి ఇం డ్లు ఉంటే తమకు సమాచారమివ్వాలని, వాటిని తొలగిస్తామన్నారు. కౌన్సిలర్లు సైతం వార్డుల్లో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవసరం ఉ న్న తమను సంప్రదించాలన్నారు. అదేవిధంగా వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో..
మక్తల్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎ మ్మెల్యే నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారా ష్ట్రం, తెలంగాణలో ఇటీవల కురుసున్న వర్షాలకు కృష్ణ నది లో వరదనీరు పెరుగుతుండడంతో నదీ పరివాహక ప్రాం తాల ప్రజలు మాగనూర్, కృష్ణ, మక్తల్ ప్రజలను అప్రమ త్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జీవాలను నదీ పరివాహక ప్రాంతాలకు తరలించకుండా చూడాలన్నారు. కురుస్తున్న వర్షాలకు ముందస్తు జాగ్రత్తగా సీఎం కేసీఆర్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారన్నారు. ప్రజ లు కురుస్తున్న వర్షాలకు అత్యవసరమేతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దన్నారు. కురుస్తున్న వర్షాలకు చిన్నపిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రతి ఇం టిలో వేడి నీటి కాచి తాగాలన్నారు.