మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 10 : బక్రీద్ పర్వదినాన్ని జిల్లావ్యాప్తంగా ముస్లిం లు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజాప్రతినిధు లు, వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎదిర జామియా మసీదులో హఫిజ్ ఫెరోజ్ ఆధ్వర్యలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు అబ్దుల్హకీం, అజీజుల్లా, నజీరుద్దీన్, ఇసాక్, జహంగీర్, ముర్షిద్, సుభాహన్, హజీ, షఫి, సిరాజ్, జీపీ.మ గ్బూల్, ఫయాజ్ పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్ల, జూలై 10 : జడ్చర్ల పట్టణంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జ రుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి ముస్లింలకు బక్రీద్ శు భాకాంక్షలు తెలిపారు. వివిధ పార్టీల నాయకు లు, ప్రజాప్రతినిధులు ముస్లింలను కలిసి శు భాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, జూలై 10 : మున్సిపాలిటీలోని జుమా మసీదు, జామా మసీదుల్లో ని ర్వహించిన బక్రీద్ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ పాల్గొని ము స్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సురేశ్‌గౌడ్, తిరుపతయ్యగౌడ్, సదానంద్‌గౌడ్, మైనార్టీ నా యకులు అహ్మద్, యాసీన్, సాదీక్, ఖదీర్, సాబేర్, అఫ్సర్, అబూబాకర్ పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జూలై 10 : మండలంలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకొన్నా రు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోఆప్షన్ సభ్యు డు టీవీ ఖాజా, మైనార్టీసెల్ నాయకులు సయ్యద్శమీం, షిరాజ్, నాజీమ్ తదితరులకు ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య శుభాకాంక్షలు తెలిపారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జూలై 10 : మండలకేంద్రంతోపాటు బోయిన్పల్లి, వాడ్యాల్, మసిగుండ్లపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గా ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూలై 10 : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని మండలం లో ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. నేరళ్లపల్లి, మోతీఘణపూర్, చిన్నరేవల్లి, పె ద్దాయపల్లి, పెద్దరేవల్లి, మొదంపల్లి తదితర గ్రామాల్లో ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఖలీల్, ఉపసర్పంచ్ లతీ ఫ్, టీఆర్ఎస్ మైనార్టీసెల్ మండల అధ్యక్షు డు జమీరుల్లా, అప్సర్‌ఖాన్, జమీర్, మహ్మద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జూలై 10 : మండలకేంద్రంతోపాటు తిర్మలాపూర్, చొక్కంపేట, చెన్నవెల్లి, ఖానాపూర్, రంగారెడ్డిగూడ, కుచ్చర్కల్ తదితర గ్రామాల్లో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యే క పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, వివి ధ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, జూలై 10 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదు ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, జూలై 10 : మండలకేంద్రంతోపాటు యన్మన్గండ్ల, ఇప్పటూర్, కారుకొండ, కూచూర్, కొల్లూరు, చౌడూర్, పోమాల, గురుకుంట తదితర గ్రామాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల్లో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించారు. పోమాలలో సర్పంచ్ కృష్ణయ్య ముస్లింల కుటుంబాలకు చక్కెర, సెమియా ప్యాకెట్లను అందజేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో సర్పంచులు గోపాల్గౌ డ్, జయమ్మ, గౌషియాఅబ్దుల్లా, లక్ష్మ మ్మ, సౌజన్య, కృష్ణయ్య, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ చందర్‌నాయక్, రాజు పాల్గొన్నారు.