నారాయణపేట టౌన్, జూలై 10 : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరుగకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్ర ధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆదివారం రాష్ట్ర ప్రధానకార్యదర్శి భారీగా కురుస్తు న్న వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జి ల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక రా ష్ర్టాల నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ జరిగే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. నీటి ప్రవాహం ఉ న్న వంతెలను, రోడ్లు, రహదారుల వద్ద రా కపోకలను నిలిపివేయాలన్నారు.
భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పంచాయతీ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లు నష్టం వాటిల్లితే వివరాల ను వెంటనే అందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాల ని, భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం జ రుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల ని ఆయన సూచించారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్ పద్మజారాణి పాల్గొన్నారు.