మూసాపేట(అడ్డాకుల), జూలై 7 : హరితహారం కార్యక్రమంలో భాగంగా విత్తనబంతులను తయారు చేసి అటవీశాతాన్ని పెంచుదామని ఎంపీపీ దోనూర్ నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో విత్తనబంతుల తయారీపై గురువారం మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. అడ్డాకుల మండలంలో 17లక్షల విత్తనబంతులను తయారు చేయాలని లక్ష్యంగా ఉందని, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని నిర్ణీత గడువులోగా విత్తనబంతులను తయారు చేయాలని కోరారు. విత్తనబంతుల తయారీలో మహిళా సంఘాలతోపాటు ఐసీడీఎస్, విద్యాశాఖ అధికారు లు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎంఈవో నాగ య్య, ఏపీఎం సుదీర్‌కుమార్ పాల్గొన్నారు.
టార్గెట్ 15లక్షలు
కోయిలకొండ, జూలై 7 : మండలంలో 15లక్షల విత్తనబంతులను తయారు చేసి చల్లడమే లక్ష్యమని ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో విత్తనబంతుల తయారీపై అవగాహ న కల్పించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ కృష్ణయ్య, సర్పంచుల సంఘం మండల అ ధ్యక్షుడు కృష్ణయ్య, ఎంపీటీసీలు నిరూపమ, రాణి, విజయలక్ష్మి, రోజా, మణె మ్మ, ఎంపీడీవో జయరాం, ఏపీవో సునీత ఉన్నారు.
గండీడ్ మండలంలో..
మహ్మదాబాద్, జూలై 7 : విత్తనబంతుల తయారీపై ఉమ్మడి మండలంలోన మహిళా సంఘాల సభ్యులకు గండీడ్ రైతువేదికలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వ లక్ష్యం మేరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విత్తనబంతులను తయారు చేసి అటవీ ప్రాంతాల్లో చల్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, ఎంఈవో వెంకటయ్య, సర్పంచ్ చంద్రకళ, ఏపీఎం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూలై 7 : విత్తనబంతుల తయారీపై మండల పరిషత్ కార్యాలయం లో అంగన్వాడీ, ఐకేపీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కృష్ణారావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల టార్గెట్ మేరకు మండలంలో విత్తనబంతులను తయారు చేసి అటవీ ప్రాంతా ల్లో చల్లాలని సూచించారు. విత్తనబంతుల తయారీలో మహిళా సంఘాల సభ్యులతోపాటు విద్యార్థులను భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు శంకరమ్మ, సునీత, ఏపీఎం నాగరాజు, అంగన్వాడీ టీచర్లు కమల, జరీనాబేగం, సునీత ఉన్నారు.