Nani Movie | నాని – వెంకీ అట్లూరి కాంబో: సితార బ్యానర్లో మరో క్రేజీ మూవీ.!
Nani Venky Atluri | స్టార్ కథానాయకుడు నాని ప్రస్తుతం వరుస హిట్లతో జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న నాని ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
Nani Venky Atluri | స్టార్ కథానాయకుడు నాని ప్రస్తుతం వరుస హిట్లతో జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న నాని ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ రెండు చిత్రాలు కాకుండా మరో క్రేజీ దర్శకుడితో నాని చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో నాని సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నాడు. ‘జెర్సీ’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తర్వాత నాని – సితార కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.
ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 26, 2026న విడుదలయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మరోవైపు వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ (Suriya 46) చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ కమిట్మెంట్లు అన్నీ పూర్తయిన తర్వాత, 2026 ద్వితీయార్థంలో నాని – వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- JerseyCombo
- nagavamsi
- Nani
- Nani34
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

