మక్తల్ టౌన్, జూన్ 21 : తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌కు మార్గనిర్దేశకుడుగా వ్యవహరించిన నాయకుడు జయశంకర్ సార్ అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వర కు వ్యాప్తి చేసిన నాయకుడు జయశంకర్ సార్ అని, మ లిదశ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌కు సలహాదారుడిగా ఉం టూ తోడ్పాటు అందించాడన్నారు. జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన వ్యక్తి అని ఎ మ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీ నివాస్గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, కౌన్సిలర్లు, నాయకు లు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ సార్‌కు ఘన నివాళి
ఊట్కూర్, జూన్ 21 : తెలంగాణ సి ద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ ర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక 1వ అంగన్వాడీ కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జయశంకర్ సార్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని అంగన్వాడీ టీచర్ సూ చించారు. కార్యక్రమంలో ఆయా అంజలమ్మ, యువకు లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆశయాలను కొనసాగించాలి
నారాయణపేట, జూన్ 21 : ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి అన్నారు. ఆచా ర్య జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ అందించిన సేవల ను కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, సీనియర్ నాయకులు వెంకట్రాములు, కార్తీక్, యువజన అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.