మక్తల్ రూరల్, జూన్ 21 : ఒక్కొక్కటి వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాముల నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.1.8 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మంథన్‌గోడ్‌లో వెయ్యి మెట్రిక్ టన్నుల సామ ర్థ్యం గల సహకార గిడ్డంగి నిర్మాణానికి ఎమ్మెల్యే చిట్టెం మంగళవారం భూమి పూజ చేసి పను లు ప్రారంభించారు. కార్యక్రమానికి డీ సీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు.
రైతులు ధాన్యం నిల్వలను ఉంచుకోవడానికి పీఏసీసీఎస్ ఆధ్వర్యం లో మండలంలోని మంథన్‌గోడ్, కర్ని, భూత్పూర్ గ్రామాల్లో గోదాములను నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడుతలో మంథన్‌గోడ్‌లో భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. గోదాముల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, ఆంజనేయులుగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ మహాదేవమ్మ, ఎంపీటీసీ సు మిత్ర, ఉపసర్పంచ్ కృష్ణయ్యగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.