భూత్పూర్, జూన్ 21: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కులవృత్తులకు ప్రాధాన్యతమిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో కుమ్మరి కులస్తుల సదస్సుకు హాజరై మాట్లాడారు. కుమ్మరి కులస్తులు తమ కుల వృత్తిని తక్కువచేసి చూడకుండా మట్టిపాత్రలను చేయడంలో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. కుమ్మరుల ఉపాధికి ఓ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, మూసాపేట మండలంలో దాదాపు రూ.2కోట్ల విలువ చేసే రెండెకరాల పొలాన్ని ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కుమ్మరి కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాంచంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద్, నాబార్డు డీడీఎం శ్రీనివాస్, సూగూరు మురళి తదితరులు పాల్గొన్నారు. మూసాపేట మండలం వేములకు చెందిన నర్సింహకు చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి మంజూరైన రూ.లక్షా50వేల చెక్కును అందజేశారు.
బీటీరోడ్లకు నివేదికలను సిద్ధం చేయాలి
దేవరకద్ర నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో కొత్తగా బీటీరోడ్ల నిర్మాణాలకు నివేదికలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి అన్నాసాగర్‌లో పంచాయతీరాజ్ ఈఈ నరేందర్‌తో మాట్లాడారు. నియోజవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. టెండర్ పూర్తయిన రోడ్ల పనులను ప్రారంభించాలని, ప్రతిపాదనలు చేసిన వాటిని ప్రభుత్వానికి పంపాలని కోరారు. మనఊరు-మనబడి పనులను పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈలు కురుమూర్తి, అభిషేక్, లక్ష్మణ్‌గౌడ్, జెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్థివదేహానికి మంత్రి, ఎమ్మెల్యే నివాళి
మూసాపేట(అడ్డాకుల), జూన్ 21: మండలంలోని కందూరు మాజీ ఎంపీపీ, బీసీ నేత దివంగత కందూరు నారాయణ తల్లి వెంకటమ్మ(85) పార్థివదేహానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం వేర్వేరుగా పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మంత్రి, ఎమ్మెల్యే వెంట ఎంపీపీ నాగార్జునరెడ్డి, మూసాపేట జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీ శామలమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, బీసీ నేతలు, గ్రామస్తులు నివాళులర్పించారు.