దేవరకద్రరూరల్, జూన్ 19: అట్టడుగుస్థానంలో ఉండి ఆర్థికపరంగా అవస్థలు పడుతూ సతమతమవుతున్న దళితులను రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలో ఆదివారం ఎమ్మెల్యే ఆల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. మండలకేంద్రానికి చెందిన సతీశ్‌కు దళితబంధు కింద మంజూరైన ఎస్ఎం క్లాత్ స్టోర్స్, గార్మెంట్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అనంతరం గుడిబండలో పర్యటించి పల్లెప్రగతిలో చేసిన పనులను పరిశీలించారు. నాగన్నపల్లికి చెందిన రైతు ఆంజనేయులు, గుడిబండకు చెందిన నాగరాజు మృతిచెందటంతో రైతుబీమా పథకం ద్వారా వచ్చిన బీమా చెక్కులు అందజేశారు.
అనంతరం పుట్టపల్లిలో గ్రామీణ క్రీడాప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, హైమాక్స్ లైట్లు, గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, ఎంపీడీవో శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ముడా డైరె క్టర్ కర్ణం రాజు, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, సర్పంచులు ఎద్దుల జ్యోతి, శ్రీనివాసులు, శివరాజు, సింగిల్‌విండో డైరెక్టర్ కృష్ణగోపాల్, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్, కుర్వ శ్రీనివాసులు, ఆంజనేయులు, యుగంధర్‌రెడ్డి, శివానంద్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.