మహబూబ్‌నగర్, జూన్ 19 : పల్లెలు, పట్టణాల్లో పేరుకుపోయిన ప్రతి సమస్యకు ముగింపు పలుకుతూ ప్రత్యేకం గా గుర్తించిన సమస్యలను పరిష్కారం వైపు ముందుకు తీ సుకుపోవడం జరిగింది. ఈనెల 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జిల్లా అ ధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రతిరోజూ ఆయా కాలనీల్లో పాదయాత్రలు చేస్తూ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు గా అవుతూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు అడుగులు వేశారు. ఈ మేరకు పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
పల్లె ప్రగతి ఇలా…
జిల్లావ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం సమర్థవంతం గా సాగింది. పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానంలో 35 వేల మంది ప్రజలు పాల్గొన్నారు. 41 తెలంగాణ క్రీడాప్రాంగాణాలు ప్రారంభం, 473 క్రీడా ప్రాంగాణాలకు స్థలాల గుర్తింపు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారం తో 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమం ముందుకు తీసుకుపోవడం జరిగింది. జిల్లావ్యాప్తంగా 3303 మంది ప్రజ లు పాల్గొని రహదారులను శుభ్రం చేయడం, 1577 ము రుగు కాల్వలు, 6959 ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేసిన ట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 1577 మురుగు కాల్వలు, బహిరంగ స్థలాలను శుభ్రం చేయడం. 685 పడిపోయిన గృహాలు, చెత్తాచెదారాలను తొలగించారు. 2142 ప్రాంతాల్లో తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది.
సుమారు 703 గుంతలను పూడ్చివేయగా, 606 లోతట్టు ప్రాంతాలను పూడ్చి వేయడం జరిగింది. 983 వ్య క్తిగత మ్యాజిక్ సోక్ పిట్లు, 174 కమ్యూనిటీ సోక్పిట్లు ని ర్మించడం, 441 గ్రామ పంచాయతీల్లో చివరి రోజూ వరకు 30453 మంది స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొన్నారు. 14 వైకుంఠధామాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వగా, 160 వా టికి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. టాయిలెట్స్ సౌక ర్యం కల్పించారు. 336 కిలోమీటర్ల మేర రహదారులకు ఇ రువైపులా మొక్కలు నాటడం జరిగింది, 11 స్థలాలను గు ర్తించి బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటను చేసేందుకు గుర్తించారు. 204 విద్యుత్ స్తంభాలకు 3వ వైర్ వేయగా, 105 తప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను మార్చడం జరిగిం ది. 116 స్తంభాలను సరిచేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం లో 207 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావడం జరిగింది.

పట్టణ ప్రగతిలో….
జిల్లావ్యాప్తంగా ఉన్న మూడు పట్టణ కేంద్రాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు శరవేగంగా పక్కా ప్రణాళికలతో అధికారులు ముందుకు తీసుకుపోయారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొక్కలను ఇష్టంగా పెంచి పెద్దగా చేస్తున్న దంపతులను పలువురి కలెక్టర్ ఎస్.వెంకట్రావు ప్రత్యేకంగా స న్మానించి ప్రోత్సహించారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీల్లో దోమల నివారణకు సంబంధించి ప్రజలను రోగాల బారిన పడకుండా 10600 సెప్టిక్‌ట్యాంక్ పైపులకు నెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాఠశాలల్లో కిటికీలకు తలుపులకు నెట్లు ఏర్పాటు చేయడం, పాఠశాలలను శుభ్రం చేయడం జరిగింది. మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మూడు మున్సిపాలిటీల్లో గడిచిన 15 రోజుల్లో 1825 టన్నుల చెత్తను తొలగించడం జరిగింది.
172 శిథిలాల వ్యర్థాలను తొలగించడం, డ్రైనేజీలను శు భ్రంలో భాగంగా 318 మురుగు కాలువలలో పూడిక తీ యగా, మురుగు నీటి కాలువల్లో 17 జాలీలు ఏర్పాటు చే యడం జరిగింది. 48 లోతట్టు ప్రాంతాలను పూడ్చడం, దోమల నివారణలో భాగంగా 382 ప్రాంతాల్లో స్ప్రే ఫాం గింగ్ చేయడం జరిగింది. 126 కిలోల సింగిల్ యూజ్ ప్లా స్టిక్‌ను సీజ్ చేయడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న 20 ఇండ్లను తొలగించడం, 3223 మొక్కలను నాటడం జరిగింది. 121 తాగునీటి పైప్లైన్ల ను మరమ్మతులు చేపట్టి సరి చేయడం, 38 ఒరిగిన విద్యుత్ స్తంభాలను, 43 విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టినవిగా గుర్తించడం జరిగింది. మూడు మున్సిపాలిటీల్లో 6 చోట్ల తె లంగాణ గ్రామీణ క్రీడాప్రాంగాణాలు ఏర్పా టు చేసేందుకు గుర్తించడం జరిగింది. ము న్సిపాలిటీల్లో 2 క్రీడాప్రాంగాణాలు ప్రారంభించం జరిగింది.
మహబూబ్‌నగర్‌లోని రామయ్యబౌళి ప్రాంతంలో రూ.2 కోట్లతో పెద్ద డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ పట్టణ ప్ర గతి ముగింపు చేయడం జరిగింది.
ప్రణాళికలతో ప్రగతి కార్యక్రమాలు
ఈనెల 3 నుంచి 18వ వరకు ప్రతి రోజూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రత్యేకంగా ప క్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలను ముం దుకు తీసుకుపోవడం జరిగింది. చాలా మంది ప్రజలు స్వచ్ఛందగా వారి నివాసం ఉంటున్న ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విజయవంతంగా పల్లె, పట్ట ణ ప్రగతి కార్యక్రమాలను ముగించడం జరిగింది.
-ఎస్.వెంకట్రావు, కలెక్టర్