ఊట్కూర్, జూన్ 19 : నిరుద్యోగులకు శాపంగా మారిన అగ్నిపథ్ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని టీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రా మలింగం డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధా నం దేశ రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే దుస్థితికి కేంద్రం దిగజారడం దౌర్భాగ్యమన్నారు. బీజేపీ తప్పుడు నిర్ణయంతో దేశ యువత తీవ్రంగా నష్టపోతుందని, అగ్నిపథ్ ఉపసంహరించుకొని రెగ్యులర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ని ర్వహించాలన్నారు. అగ్నిపథ్ రద్దు చేయకపోతే దేశ యువతకు మద్దతుగా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు శేఖర్‌రెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్‌యాదవ్, నాగరత్నారెడ్డి పాల్గొన్నారు.