హన్వాడ, జూన్ 19: రోజురోజుకూ ప్రభుత్వ బడులు బలోపేతమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై మొ గ్గు చూపుతున్నారు. మండలంలోని దొర్రితండా ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని గురుకుల పాఠశాలలకు ఎంపిక చేస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్‌కు దీటుగా విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్య అందిస్తున్నారు. అందుకు నిదర్శనం.. గు రుకులాలకు ఏటా ఎంపికవుతున్నారు. 23మంది గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాస్తే 16మంది ఎంపికయ్యారు. ఏటా పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపిక అవుతున్నారు.ఉపాధ్యాయుల కృషితో జిల్లాలోనే దొర్రితండా పాఠశాల ఆదర్శంగా నిల్చింది.
2017లో ఆరుగురు విద్యార్థులు, 2018లో నలుగు రు, 2019లో 13మంది, 2020లో 12మంది, 2021లో 20మంది, 2022లో 16మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రత్యేక అభినందిస్తున్నారు. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ వెంకట్రావుతోపాటు మం డల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులను అభినందించారు.
ఏటా గురుకులాలకు ఎంపిక
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్‌లో చదువుకుంటే ఎలా నష్టం జరుగుతుందో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో గ్రామస్తులు ముందుకొచ్చి ప్రైవేట్‌కు ఒక్కరిని కూడా పంపించకుండా ప్రభుత్వ బడుల్లోనే చేర్పించారు. వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రతిరోజూ సమయపాలన పాటిస్తూ పాఠశాలకు వెళ్తున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వారిని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నాం. ఏటా గురుకులాలకు ఎంపికవుతున్నారు. గ్రామప్రజలు సహకరించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
– మల్లేశ్ హెచ్ఎం, దొర్రితండా, పాఠశాల