తులాభారం
కాలే ఉదరమే కానీ కడుపునిండా తిండి లేదు కంటి నిండా నిద్ర లేదు ఒంటి నిండా బట్ట లేదు సంతోషమంటే తెలియదు
కాలే ఉదరమే కానీ
కడుపునిండా తిండి లేదు
కంటి నిండా నిద్ర లేదు
ఒంటి నిండా బట్ట లేదు
సంతోషమంటే తెలియదు
ఆవగింజంత సుఖము లేదు
అలుముకున్నది అంధకారం
ఛేదించటానికి లేదు బలం
జీవితమంతా నిర్వేదం
జీవిత నిఘంటువులో
దొరకదు జీవితానికి
సమానార్థం
నాలుగు అంకెల జీతం
సాగీ సాగని సంసారం
ఆటుపోటుల ప్రయాణం
భుజంపై నా భారం
కావడికుండల తులాభారం
రుక్మిణి వేస్తే తులసిదళం
అయ్యింది పూర్తి జీవితం
– జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

