మర్యాదగానే ఉంటది!
ఇలా అడ్డా మీద కూలీ కోసం గుంపులో నిలబడ్డం మర్యాదగానే ఉంటది రెక్కల కష్టంతో సంపాదించిన నాలుగు కూలీ డబ్బులతో కలో గంజో తాగి కాల్వ పక్కన గుడిసెలో పడుంటే వచ్చే నిద్ర సుఖంగానే ఉంటది
ఇలా అడ్డా మీద కూలీ కోసం గుంపులో
నిలబడ్డం మర్యాదగానే ఉంటది
రెక్కల కష్టంతో సంపాదించిన
నాలుగు కూలీ డబ్బులతో
కలో గంజో తాగి కాల్వ పక్కన గుడిసెలో పడుంటే వచ్చే నిద్ర సుఖంగానే ఉంటది
ఒక్కరోజు సభకు ఎవడో ఇచ్చే ఉచిత సారాసీసా, బిర్యాని పొట్లం కన్నా
వాడు అందలం ఎక్కాక ఇచ్చే ఉచితాల కన్నా
నెత్తికి మురికి రుమాలు చుట్టుకొని,
భుజం మీది చిరుగుల తుండుగుడ్డను
ఒక్కసారి గర్వంగా దులిపి తిరిగి భుజం
మీద కప్పుకోవడంలో ఎంత పొగరుంది!
మేస్త్రీ పనో, ఇటుకలెత్తే పనో,
రోడ్లూడ్చే పనో, చెత్త ఎత్తే పనో
షావుకారు దుకాణంలో బస్తాలు
వీపు మీద మోసే పనో, ఏదైతేనేం పని పనే కదా!
పని పొగరు నా నెత్తి మీద రుమాలుకు నెమలీకల రంగులద్ది నాట్యమాడుతది
ఖాళీ కడుపు మీద, కాలే గుండె మీద
కాలు ముడుచుకొని కూర్చున్నప్పుడు
చెమట చుక్కలో, కన్నీటి చుక్కలో
బతుకు దాహాన్ని ఆర్పుతూ ఉంటే
బానిస బతుకు కన్నా రోడ్డు
పక్కన పేవ్మెంట్ మీద కూచొని
దుమ్ము దుప్పటి కప్పుకొని
అన్నప్రసాదాలెవరైనా పెడతారేమోనని ఎదురుచూడ్డం గౌరవంగానే ఉంటది
ఎదురుగా ఉన్న గొప్ప చరిత్రను,
అభివృద్ధిని రోజూ నెమరేస్తూ
కొద్దికొద్దిగా చావడంకన్నా
ఏమీ లేనితనం ఎందుకని
కూలీ వాడి శవాన్ని మోసే కూలీ వాడికి
పనైనా దొరికినందుకు సంతోషంగానే ఉంటది.
– డా. రూప్ కుమార్ డబ్బీకార్ 9177857389
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

