Chiranjeevi | డిజిటల్ ప్రపంచంలోకి మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. పోడ్కాస్ట్తో సినీ రహస్యాలు బయటకు!
Chiranjeevi | టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది అభిమానులను అలరించిన చిరంజీవి, తొలిసారిగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక ప్రతిష్టాత్మక పోడ్కాస్ట్ ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.
Chiranjeevi | టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది అభిమానులను అలరించిన చిరంజీవి, తొలిసారిగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక ప్రతిష్టాత్మక పోడ్కాస్ట్ ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. ఇప్పటివరకు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన చిరంజీవి, ఈసారి తన జీవిత ప్రయాణం, సినీ అనుభవాలు, ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలు, విజయాల వెనుక కథలు, తెరవెనుక జరిగిన ఆసక్తికర సంఘటనలు ఈ పోడ్కాస్ట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోను సూపర్ హిట్ చేసిన ఆయన, ఇప్పుడు చిరంజీవి ప్రాజెక్ట్‌కు బాధ్యతలు చేపట్టడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బి.వి.ఎస్. రవి ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించినట్లు తెలుస్తోంది. “శూన్యం నుంచి ప్రారంభమై ఒక సాధారణ వ్యక్తి మెగాస్టార్ స్థాయికి ఎలా ఎదిగాడు? ఆ ప్రయాణం వెనుక ఉన్న కృషి, పట్టుదల, పోరాటం గురించి రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ షో రూపొందుతోంది” అని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
ఈ పోడ్కాస్ట్ గురించి గతంలో చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కూడా కొన్ని సూచనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పటినుంచే మెగా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు బి.వి.ఎస్. రవి వ్యాఖ్యలతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది.అయితే ఈ షోలో ఎవరెవరు అతిథులుగా పాల్గొంటారు? చిరంజీవితో కలిసి పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, సహనటులు ఇందులో కనిపిస్తారా? లేక ఆయన కెరీర్‌లోని ప్రముఖ చిత్రాలను ఆధారంగా చేసుకుని ఎపిసోడ్లను రూపొందిస్తారా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోడ్కాస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, మెగాస్టార్ జీవితంలోని ఎన్నో ఆసక్తికరమైన కథలు, తెలియని సంఘటనలు ఈ వేదిక ద్వారా అభిమానులకు చేరువయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ కొత్త డిజిటల్ ప్రయాణం మెగా అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించబోతున్నట్లు కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

