Ram Charan | ‘బుమ్రా ఫుట్‌బాల్ ప్లేయర్’ అంటూ రామ్ చరణ్ కామెంట్.. క్షమాపణలతో వివాదానికి ముగింపు!
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన టీమ్, తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో భారీ లైవ్ కాన్సర్ట్ నిర్వహించింది.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన టీమ్, తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో భారీ లైవ్ కాన్సర్ట్ నిర్వహించింది. అయితే ఈ ఈవెంట్లో రామ్ చరణ్ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్లో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ల పేర్లు చెబుతూ వారి గురించి ఒక్క మాటలో స్పందించాలని కోరగా, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ల గురించి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు వచ్చిన సమయంలో రామ్ చరణ్ పొరపాటు చేశారు. బుమ్రా గురించి మాట్లాడే క్రమంలో, “నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. ఆయన ఫుట్‌బాల్ చాలా అద్భుతంగా ఆడతారు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొనడం అక్కడున్న వారితో పాటు సోషల్ మీడియా వినియోగదారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా కార్యక్రమం మధ్యలో భోపాల్ అని చెప్పాల్సిన చోట పొరపాటున బీహార్ అని సంబోధించడం కూడా మరో చర్చకు కారణమైంది. దీంతో ఈ వీడియో క్లిప్స్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్లోబల్ స్టార్ హోదాలో ఉన్న నటుడికి భారత క్రికెట్ స్టార్ గురించి సరైన అవగాహన లేదా అంటూ కొంతమంది నెటిజన్లు విమర్శలు చేశారు. మరోవైపు బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడంపై క్రికెట్ అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో సోషల్ మీడియాను నింపేశారు.
అయితే వివాదం మరింత పెద్దదిగా మారకముందే రామ్ చరణ్ స్పందించడం విశేషంగా మారింది. కార్యక్రమం ముగిసిన వెంటనే తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా బుమ్రాకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేశారు. బుమ్రాను ట్యాగ్ చేస్తూ, “మీ విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. మైదానంలో మీ ఆటకు నేను అభిమానిని. మీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది” అంటూ పేర్కొన్నారు. తన పొరపాటును అంగీకరిస్తూ ఆయన హుందాగా స్పందించడం అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ ఘటనపై మెగా అభిమానులు కూడా స్పందిస్తున్నారు. రామ్ చరణ్‌కు పేర్లు, సందర్భాలు కొన్ని సార్లు త్వరగా గుర్తుకురావని, గతంలో కూడా ఇలాంటి చిన్న పొరపాట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల సమయంలో సహనటుడు ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని సరదాగా ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bhopal
- buchi babu
- bumrah
- glimpse
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

