White House | వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. భద్రతాసిబ్బంది కాల్పుల్లో దుండగుడు మృతి
White House | అమెరికా (USA) అధ్యక్ష భవనం వైట్ హౌస్ (White House) దగ్గర కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. యూఎస్ సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్‌పై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో అతను మరణించాడు. ఈ ఘటనలో ఒక పౌరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
White House : అమెరికా (USA) అధ్యక్ష భవనం వైట్ హౌస్ (White House) దగ్గర కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. యూఎస్ సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్‌పై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో అతను మరణించాడు. ఈ ఘటనలో ఒక పౌరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం.. 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ (Pennsylvania avenue) వద్ద ఉన్న భద్రతా చెక్‌పాయింట్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్‌లోంచి తుపాకీ తీసి అక్కడున్న సీక్రెట్ సర్వీస్ అధికారులపై కాల్పులు ప్రారంభించాడు.
తక్షణమే అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని నిలువరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారని, ఆయన సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టంచేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. ఈ కాల్పుల ఘటనలో గాయపడిన పౌరుడి పరిస్థితి విషమంగా ఉందని, అతనికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సహకారంతో దర్యాప్తు చేస్తున్నామని సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో వైట్‌హౌస్‌ను తాత్కాలికంగా లాక్డౌన్ చేసి కొద్దిసేపటి తర్వాత ఎత్తివేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

