ఊట్కూర్, జూన్ 19 : వరుణ దేవుడు దోబూచులాడుతున్న క్రమంలో వరుణుడి కటాక్షం కోసం మండలంలోని పెద్దపొర్ల గ్రామానికి చెందిన పలువురు చిన్నారులు ఆదివారం బొడ్రాయికి జలాభిషేకం చేశారు. జూన్ నెల ఆరంభంలో కురిసిన తొలకరి వ ర్షానికి మండలవ్యాప్తంగా రైతులు పెద్ద మొత్తంలో పత్తి విత్తనాలు విత్తుకున్నారు.
ఆ తర్వాత వరుణ దేవుడు ముఖం చాటేయడంతో విత్తు మొలవకపోగా.. వర్షం కోసం అన్నదాతలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించిన రైతు బిడలు వర్షం కోసం స్థానిక వాల్మీకి ఆలయం వద్ద ఉన్న బొడ్రాయికి బిందెలతో మడి నీళ్లు తెచ్చి జలాభిషేకం చేశారు. వర్షం కురియాలని సామూహికంగా ప్రార్థన చేశారు.